Black Gram : వరిమాగాణుల్లో మినుము సాగుకు అనువైన రకాలు!

తొలకరిలో జూన్ 15 నుండి జులై 15 లోపు, రబీ లో మెట్ట భూముల్లో అక్టోబరు నుండి నవంబర్ 15 లోపు, రబీ లో మాగాణి లో నవంబర్ నెలలో, వేసవిలో మరియు వేసవి అరుతడిలో ఫిబ్రవరి 15 నుండి, వేసవిలో మాగాణి లో మార్చి నెల 15 వరకు విత్తుకోవచ్చు. రబీ లో వరి భూముల లో నవంబర్ 15 నుండి డిసెంబర్ మొదటి వారం లోపు పైరు వేయాల్సి ఉంటుంది.

Black Gram :

Black Gram : తెలుగు రాష్ట్రాల్లో మినుము పంటను తొలకరిలోనూ, రబీలో మరియు వేసవిలో వరి కోతల తర్వాత పండిస్తారు. మురుగు నీరుపోయే వసతి గల, తేమను నిలుపుకోగల భూములు మినుము పంటసాగుకు అనువైనవి. చౌడుభూములు పనికిరావు. మినుము సాగుకు చేపట్టాలనుకునే వారు ముందుగా నేలను సిద్ధం చేయాలి. వేసవి దుక్కి చేసి తొలకరి వర్షాలుపడగానే గొర్రు తోలి భుమిని మెత్తగా తయారు చేయాలి.

తొలకరిలో జూన్ 15 నుండి జులై 15 లోపు, రబీ లో మెట్ట భూముల్లో అక్టోబరు నుండి నవంబర్ 15 లోపు, రబీ లో మాగాణి లో నవంబర్ నెలలో, వేసవిలో మరియు వేసవి అరుతడిలో ఫిబ్రవరి 15 నుండి, వేసవిలో మాగాణి లో మార్చి నెల 15 వరకు విత్తుకోవచ్చు. రబీ లో వరి భూముల లో నవంబర్ 15 నుండి డిసెంబర్ మొదటి వారం లోపు పైరు వేయాల్సి ఉంటుంది. రబీకాలంలో మినుమును వరి మాగాణుల్లో పండిస్తారు. వరి కోయడానికి 2-౩ రోజుల ముందుగా మినుము విత్తనాన్ని వెదజల్లుతారు. ఈ విధంగా చల్లిని విత్తనం మొలిచి భూమిలోని మిగిలిన తేమని, సారాన్ని ఉపయోగించుకొని పెరిగి చేతికొస్తుంది.

వరిమాగాణుల్లో సాగుకు అనువైన మినుము రకాలు ;

ఎల్.బి.జి.-22: దీని పంట కాలం 85 రోజులు. దిగుబడి ఎకరాకు 8-10 క్వి౦టాళ్ళు. సాదా రకం. మొక్క పైన, కాయపైననూగుఎక్కవ, ఎండు తెగులును తట్టుకుంటుంది. ఆలస్యంగా విత్తేందుకు అనుకూలం.

ఎల్.బి.జి.-685: దీని పంట కాలం 85-90 రోజులు. దిగిబడి ఎకరానుకు 8-9 క్వి౦టాళ్ళు. పోలిష్ రకం, ఎండు తెగుకును తట్టుకుంటుంది. కాయల పై నూగు తక్కువగా వుంటుంది. కాయల కణుపుల వద్ద కూడా కాస్తుంది. ఆలస్యంగా విత్తేందుకు అనుకూలం.

ఎల్.బి.జి-645: దీని పంటకాలం 85-90 రోజులు. దిగుబడి ఎకరాకు 8-12 క్వి౦టాళ్ళు. లావు పాటి పాలిష్ రకం. ఎండు తెగులును తట్టుకుంటుంది. కాయల పై నూగు తక్కువగా ఉంటుంది. కాయలు పోడవు, నూగు ఉండదు.

ఎల్.బి.జి.-402(ప్రభవ): దీని పంట కాలం 90-95 రోజులు. దిగుబడి ఎకరాకు 8-9 క్వి౦టాళ్ళు. గింజలు లావుగా సాదాగా ఉంటాయి. ఎత్తుగా పెరిగి కలుపును అణచి వేస్తుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది.

ఎల్.బి.జి.-648: దీని పంట కాలం 90-95 రోజులు. దిగుబడి ఎకరాకు 8-9 క్వి౦టాళ్ళు. పాలిష్ రకం. ఎండు తెగులును తట్టుకుంటుంది . పైరు తీగ వేస్తూ విస్తరంచి పెరుగుతుంది. కాయల పై నూగు కలిగి ఉంటుంది. బూడిద, ఆకుమచ్చ, తుప్పు తెగుళ్ళను కొంత వరకు తట్టుకుంటుంది.

ఎల్.బి.జి.-611: దీని పంట కాలం 90 రోజులు. దిగుబడి ఎకరాకు 8-10 క్వి౦టాళ్ళు. నిటారుగా పెరిగే సాదారకం. ఎండు తెగులును తట్టుకుంటుంది. కాయ మీది నూగు హెచ్చు.

పి.బి.జి.-107: దీని పంట కాలం 80-85 రోజులు. దిగుబడి ఎకరాకు 7-8 క్వి౦టాళ్ళు. సాదా రకం. ఎండు తెగులును తట్టుకుంటుంది. కాయల పై నూగు ఉంటుంది.ఆలస్యంగా విత్తేందుకు అనుకూలం.

ఎల్.బి.జి-709: దీని పంట కాలం 80- 85 రోజులు. దిగుబడి ఎకరానుకు 6-7 క్వి౦టాళ్ళు. పాలిష్ రకం .కాయల పై నూగా ఉంటుంది, మాగాణి భూములలో ఆలస్యంగా డిసంబర్ చివర వరకు విత్తుటకు అనువైనది.

ఒక కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్పాన్ మరియ 2.5 గ్రాముల థైరామ్ లేదా కాకాప్తాన్స్ మందును వాడి విత్తన శుద్ధి చేయాలి. ఒక ప్లాస్టిక్ కవర్ లో విత్తనాలు ఉంచి, అందులో ద్రవ రూపంలో ఉన్న పైన చెప్పిన మందులను విత్తనాలపై పోసి బాగా కలియబెట్టాలి. తరువాత విత్తుకునేందుకు ఉపయోగించాలి.

ట్రెండింగ్ వార్తలు