Tomato Cultivation : టమాటో సాగులో అధిక దిగుబడులకోసం సాగులో చేపట్టాల్సిన మెళకువులు

కాయ నాణ్యతను బట్టే మార్కెట్ లో ధర పలుకుతుంది. కాబట్టి టమాటను సంప్రదాయ బద్ధంగా నేలపై సాగుచేస్తే నాణ్యత రాదు. స్టేకింగ్ విధానంలో సాగుచేస్తే కాయ నేలకు తగలవు, దీంతో కాయదెబ్బతినదు. ఇటు బరువు పెరగడంతో పాటు షేనింగ్ వచ్చి మంచి రేటు వస్తుంది.

Tomato Cultivation

Tomato Cultivation : మార్కెట్‌లో టమాటా ఏ సీజన్‌లోనైనా లభిస్తుంది. ఇది నిత్య పంట. ఏ కాలంలోనైనా సాగు చేసుకోవచ్చు. మార్కెట్ లో హెచ్చుతగ్గులను గమనిస్తూ రైతులు దఫదఫాలుగా విత్తుకొని సాగుచేస్తున్నారు. అయితే నాణ్యమైన అధిక దిగుబడులను తీయటంలో మాత్రం విఫలమవతున్నారు. ఈ నేపధ్యంలో టమాట సాగులో అధిక దిగుబడుల కోసం పాటించాల్సిన  మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. శ్రవంతి.

READ ALSO : Drones In Agriculture : డ్రోన్, వరినాటే యంత్రాలకు.. సబ్సిడీ 50 శాతం

టమాట పంటను  ఏడాది పొడవునా సాగు చేయవచ్చు. కానీ అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం ఈ పంట తట్టుకోలేదు. అందువల్ల శీతాకాలంలో సాగుచేసిన పంటనుంచి అధిక దిగుబడి వస్తుంది. సారవంతమైన నేలలు, ఇసుకతో కూడిన గరప నేలలు టమాట సాగుకు అనుకూలం . ఖరీఫ్ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రైతులు టమాటను సాగుచేశారు. అయితే లేట్ ఖరీఫ్ లో టమాటను సాగుచేయాలనుకునే రైతులు ,  అనువైన రకాలు.. సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా  పొలం తయారి , పోషకాలు,  ఎరువులు, నీటి యాజమాన్యంతో పాటు చీడపీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చంటూ .. యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. శ్రవంతి.

READ ALSO : Tomato Cultivation : టమోటా సాగులో తెగుళ్లు , నివారణ పద్దతులు !

టమాటలో ఎరువుల యాజమాన్యం ఎంతో కీలకం . ఎరువులను వాడటం వలన ఉత్పత్తి పెరుగుంతుంది. కాయ కూడా నాణ్యతగా ఉంటుంది. అయితే ఎరువులను నేరుగా కాకుండా డ్రిప్ ద్వారా అందిస్తే మొక్కలకు సమపాళ్లలో అంది మంచి దిగుబడులు వస్తాయి. మరోవైపు  చీడపీడల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సకాలంలో వాటిని గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే నాణ్యమైన దిగుబడులను పొందేదుకు అవకాశం ఉంటుంది.

READ ALSO :Chili Narumadi : అధిక దిగుబడుల కోసం మిరప నారుమడిలో యాజమాన్యం

కాయ నాణ్యతను బట్టే మార్కెట్ లో ధర పలుకుతుంది. కాబట్టి టమాటను సంప్రదాయ బద్ధంగా నేలపై సాగుచేస్తే నాణ్యత రాదు. స్టేకింగ్ విధానంలో సాగుచేస్తే కాయ నేలకు తగలవు, దీంతో కాయదెబ్బతినదు. ఇటు బరువు పెరగడంతో పాటు షేనింగ్ వచ్చి మంచి రేటు వస్తుంది. సంప్రదాయ పద్ధతిలో ఎకరాకు 16 నుండి 20 టన్నుల దిగుబడి వస్తుంది. అదే స్టేకింగ్ విధానంలో  25 నుండి 40 టన్నుల దిగుబడిని తీసే అవకాశం ఉంది. పైగా పంటకాలం పెరుగుతుంది. దీని వల్ల ఎక్కువ రోజులపాటు దిగుబడిని తీసుకునే అవకాశం ఏర్పడుతుంది.

ట్రెండింగ్ వార్తలు