Prawn Cultivation : పడిపోతున్న ధరలు, చుక్కలనంటుతున్న ఉత్పత్తి వ్యయం.. రొయ్యరైతు విలవిల

రొయ్యల ధరలు పతనం కావడంతో ఆక్వా రైతులు ఆందోళనకు గురవుతున్నారు.  వాతావరణంలో మార్పుల వల్ల రొయ్యల పట్టుబడులు నిర్వహించాల్సి రావడం, మార్కెట్‌లో ధరలు గణనీయంగా తగ్గుతుండడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

Prawn Cultivation

Prawn Cultivation : డాలర్‌ పంటగా పేరొందిన రొయ్యల సాగు.. రైతులకు తీవ్ర నష్టాలను మిగులుస్తోంది.  పడిపోతున్న ధరలు, చుక్కలనంటుతున్న ఉత్పత్తి వ్యయం.. వారిని కడగండ్లలోకి నెడుతున్నాయి.  ప్రభుత్వం ధరలను నిర్దేశించినా వ్యాపారులు కుమ్మక్కై ధర తగ్గించి కొనుగోళ్లు చేస్తున్నారు.  దీంతో రొయ్య పెంపకందారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తమ ఇక్కట్లను పట్టించుకునే నాథుడే కరవయ్యాడని వారు వాపోతున్నారు.

READ ALSO : Shrimp Cultivation : వర్షాకాలంలో రొయ్యల సాగుకు పొంచి వున్న వ్యాధుల ముప్పు

రొయ్యలకు ధరాఘాతం మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ధరలను నిర్దేశించినా అమలుకు నోచుకోవడం లేదు. రొయ్యల ధరలు పతనం కావడంతో ఆక్వా రైతులు ఆందోళనకు గురవుతున్నారు.  వాతావరణంలో మార్పుల వల్ల రొయ్యల పట్టుబడులు నిర్వహించాల్సి రావడం, మార్కెట్‌లో ధరలు గణనీయంగా తగ్గుతుండడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వంద కౌంట్‌ ధర బాగా తగ్గిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా , అండలూరు..మండలంలో చాలా మంది రైతులు రొయ్యలను సాగుచేస్తున్నారు.

READ ALSO : Shrimp Diseases : నల్లబెల్లంతో.. రొయ్యల వ్యాధులకు చెక్

అయితే స్థానిక వ్యాపారులకే అమ్మతుంటారు.అయితే వ్యాపారులు సిండికేట్లుగా మారి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తుండడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. వంద కౌంట్‌ రొయ్య ధర కేజీ రూ. 220 , 60 కౌంట్ ధర కిలో రూ. 260 పలుకుతుంది. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

READ ALSO : Prawn Cultivation : వైట్‌గట్‌తో రొయ్యరైతు విలవిల..

జిల్లా నుంచి ఏటా వేల మెట్రిక్‌ టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ధరలు ఆశాజనకంగా లేని సమయంలో వాటిని నిల్వ చేసుకునేందుకు స్టోరేజీలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరాకు రూ.3 లక్షల వరకు ఖర్చు చేస్తున్న రైతులు చివరికి వాటికి వచ్చే ధరలను చూసే నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జిల్లాలోని కౌలు రైతులకు ప్రాంతాలను బట్టి కౌలు ధర నిర్ణయిస్తారు.

READ ALSO : Aqua Farming : రొయ్యపిల్లల పెంపకానికి.. బయోసెక్యూరిటీ నర్సరీలు

ఎకరాకు లక్ష రూపాయల వరకు కౌలు ధర ఉంది. అంటే ఆ రైతు కౌలు ధర చెల్లించి, పెట్టుబడి ఖర్చులు తీసివేయగా ఏమైనా మిగిలితే మిగిలినట్లు.. లేకుంటే నష్టాలను మూటగట్టుకోవలసిందే. ఒక్కో చెరువులో లక్ష రొయ్య పిల్లలను వదిలితే ప్రస్తుత వాతావరణంలో 60 వేల పిల్లలు కూడా వచ్చే పరిస్థితులు లేవు. ఒకవైపు దిగుబడి పడిపోయి, ఇంకోవైపు ధరలు పతనం కావడంతో రొయ్య రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిగా మారింది. ప్రభుత్వమే స్పందించి గిట్టుబాటు ధర వచ్చే విధంగా తగు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు