Layer Chickens : లేయర్ కోళ్ల పెంపకంతో లాభాలు ఆర్జిస్తున్న రైతు
Layer Chickens : గత దశాబ్ధకాలంలో కోళ్ల పరిశ్రమ ఏటా పది నుంచి పన్నెండు శాతం వృద్ధిరేటును కనబరిస్తే గత నాలుగైదు సంవత్సరాలుగా 15శాతం వృద్ధిరేటుతో దూసుకుపోతోంది.
- Sreehari A
- Published On : June 20, 2024 / 02:52 PM IST
farmer earns profits by rearing layer chickens
Layer Chickens : దేశంలో పాలు, మాంసం, కోడిగుడ్ల వినియోగం నానాటికీ పెరుగుతున్నది. ఇందుకు తగ్గట్టుగానే ఎంతో మంది రైతులు పౌల్ట్రి రంగాన్ని ఎంచుకొని మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు లేయర్ కోళ్ల పెంపకం చేపట్టారు. 10 నుండి 12 వారాల వరకు పెంపకం చేపట్టి గుడ్లు ఉత్పత్తి చేసే రైతులకు అమ్ముతూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు
కోళ్ల పరిశ్రమలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ముందజలో ఉన్నాయి. గత దశాబ్ధకాలంలో కోళ్ల పరిశ్రమ ఏటా పది నుంచి పన్నెండు శాతం వృద్ధిరేటును కనబరిస్తే గత నాలుగైదు సంవత్సరాలుగా 15శాతం వృద్ధిరేటుతో దూసుకుపోతోంది. ఇందుకు చాలా కారణం మార్కెట్ లో మాంసం, గుడ్లకు మంచి డిమాండ్ ఉండటమే.
ప్రధానంగా బ్రాయిలర్ కోళ్లు, అతి తక్కువ కాలంలో అంటే 5 నుండి 6 వారల్లో, 3 నుండి మూడున్నర కిలోల దాణా తిని 2 నుంచి రెండున్నర కిలోల బరువుకు చేరుకోవటంతో అతి తొందరగా మాంసోత్పత్తినిచ్చే జాతిగా పేరొందింది. గుడ్లకోళ్ల పెంపకం మాత్రం దాదాపు 90 నుండి 100 వారాల వరకు పెంపకం చేపట్టాలి. దీనికి అధిక ఖర్చు తోపాటు కూలీలు కూడా అవసరం.
కానీ, పెద్ద పెద్ద లేయర్ ఫాం రైతులు అంత రిస్క్ తీసుకోవడం లేదు. చిన్న సన్నకారు రైతుల వద్ద.. గుడ్లు పెట్టే దశ వరకు ఉన్న లేయర్ కోళ్లను కొనుగోలు చేసి… గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ఇటు రైతులకు.. అటు గుడ్ల ఉత్పత్తి దారులకు పెట్టుబడితో పాటు శ్రమ, ఖర్చు తగ్గడమే కాకుండా మంచి లాభాలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు మండలం, గవరపేట గ్రామానికి చెందిన రైతు సాగి భానుమూర్తి.. తనకున్న 40 సెంట్ల భూమిలో రెండ్లు షెడ్లను ఏర్పాటు చేసుకొని ఒక్కోరోజు లేయర్ కోడిపిల్లను కొనుగోలు చేసి పెంపకం చేపడుతున్నారు.
మొదట బ్రూడింగ్ షెడ్డులో పెంచి తరువాత మరోషెడ్ కు మారుస్తున్నారు. కోడిపిల్లల వయస్సును బట్టి దాణా అందిస్తున్నారు. ఇలా 10 నుండి 12 వారాల వరకు పెంచి తరువాత గుడ్లను ఉత్పత్తి చేసే పౌల్ట్రీ రైతులకు అమ్ముతున్నారు. సాధారణంగా వేసవిలో కోళ్లు మేత తక్కువగా తసుకొని నీటిని ఎక్కువగా తాగడం వల్ల బరువు సరిగ్గా బరువు పెరగదు. ఈ సమయంలో కోళ్లకు అధిక ధర వస్తుంది. అదే వర్షాకాలంలో మేత అధికంగా తీసుకోవడం వల్ల బరువు కూడా అంతే స్థాయిలో పెరుగుతుంది. అయితే ధర మాత్రం తక్కువ పలుకుతుందని రైతు అంటున్నారు.
Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు
