Chilli Cultivation : మిరప నార్లు పోస్తున్న రైతులు.. నాణ్యమైన నారుకోసం పాటించాల్సిన యాజమాన్యం

తెలంగాణలో 79వేల హెక్టార్లలో సాగు చేస్తుండగా , 2.8 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడిని తీస్తున్నారు. ఒక ఖమ్మం జిల్లాలలోనే దాదాపు 22 వేల హెక్టాలర్లలో సాగుచేస్తున్నారు రైతులు  ఇంతటి ప్రాధాన్యత ఉన్న పంటను సాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి.

Chilli Cultivation

Chilli Cultivation : నీటి వసతి ఉన్న వారు సంవత్సరం పొడవునా మిరప పంట వేసుకోవచ్చు.  ఖరీఫ్‌లో జూలై నుంచి ఆగస్టు వరకు విత్తనాన్ని నారు పోసుకోవచ్చు. మిరపలో మేలైన విత్తనం, నాణ్యమైన నారు అధిక దిగుబడికి సోపానం. మరి ఆరోగ్యకరమైన మిరప నారు పొందాలంటే నారుమడి పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డా. హేమంత్ కుమార్.

READ ALSO : Castor Cultivation : ఖరీఫ్ కు అనువైన ఆముదం రకాలు

తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటలలో మిరప చాలా ముఖ్యమైనది. మిరప ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఎగుమతి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆహారానికి రంగు , రుచి ఇవ్వడమే కాకుండా మిరపలో విటమిన్లు, ఔషధ లక్షణాలున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతంలో మిరపను సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మిరప 1 లక్షా34 వేల 960 ఎకరాలలో రైతులు సాగుచేస్తుండగా 7 లక్షల 39 వేల 620 టన్నుల దిగుబడివస్తుంది.

READ ALSO : Hybrid Chili Varieties : మిరపలో హైబ్రిడ్ లకు దీటుగా సూటిరకాలు.. అధిక దిగుబడులిస్తున్నలాంఫాం రకాలు

తెలంగాణలో 79వేల హెక్టార్లలో సాగు చేస్తుండగా , 2.8 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడిని తీస్తున్నారు. ఒక ఖమ్మం జిల్లాలలోనే దాదాపు 22 వేల హెక్టాలర్లలో సాగుచేస్తున్నారు రైతులు  ఇంతటి ప్రాధాన్యత ఉన్న పంటను సాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వర్షాధారంగా మిరపను సాగుచేసే రైతులు జులై, ఆగస్టు నెలల్లో నారు పోసుకోవచ్చు .

READ ALSO : Chilli Cuts Cultivation : మిరప కోతల సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సూటి రకాలైతే ఎకరాకు 650 గ్రాముల విత్తనం సరిపోతుంది. హైబ్రీడ్ రకాలైతే 100 గ్రా. సరిపోతుంది. అయితే నారుమడుల పెంపకంలో సమగ్ర యాజమాన్య చర్యలు చేపడితే నాణ్యమైన నారుపెరిగి మంచి దిగుబడులు వస్తాయంటున్నారు ఖమ్మం జిల్లా ,  వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డా. హేమంత్ కుమార్.

READ ALSO : Pest Control In Mirchi : మిరపలో పూత కాత దశలో పంటకు నష్టం కలిగిస్తున్న పూత పురుగు, నివారణ!

ముఖ్యంగా నారుమడిలో నారుకుళ్లు తెగులు,  రసం పీల్చే పురుగల ఉధృతి అధికంగా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ రెండింటిమీద శ్రద్ధ వహించి వీటిని అరికట్టినట్లైతే  నాణ్యమైన నారును సాధించి , అధిక దిగుబడిని  పొందేందుకు వీలుంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు