Weed Management : వరిపంటలో ఎరువులు, కలుపు యాజమాన్యం

వరినాట్ల పనులు ముమ్మరంగా జరుగుతున్న కాలం ఇది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 70 శాతం నాట్లు పడ్డాయి. మరొకొన్ని ప్రాంతాల్లోనాట్లు వేస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో నారు ఇంకా పెరుగుదల దశలోనే ఉంది. ఏది ఏమైనా స్వల్పకాలిక రకాలను ఈ నెలాఖరులోపు వరినాట్లు పూర్తిచేస్తే మంచి దిగుబడి సాధించే వీలుంది.

Weed Management

Weed Management : ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో నీటి వసతి ఉన్నచోట వరినాట్లు పడ్డాయి. కొన్నిచోట్ల నాట్లు వేస్తున్నారు. మరికొన్నిచోట్ల నారుమడులు ఉన్నాయి. మొత్తమీద వివిధ దశల్లో ఖరీఫ్ వరి పనులు సాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో సమగ్ర కలుపు, ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటిస్తే  రైతులు ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా, ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త, డా. డి. చిన్నమనాయుడు.

READ ALSO : Cotton Crop : ప్రస్తుతం పత్తిలో చేపట్టాల్సిన ఎరువుల యాజమాన్యం

వరినాట్ల పనులు ముమ్మరంగా జరుగుతున్న కాలం ఇది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 70 శాతం నాట్లు పడ్డాయి. మరొకొన్ని ప్రాంతాల్లోనాట్లు వేస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో నారు ఇంకా పెరుగుదల దశలోనే ఉంది. ఏది ఏమైనా స్వల్పకాలిక రకాలను ఈ నెలాఖరులోపు వరినాట్లు పూర్తిచేస్తే మంచి దిగుబడి సాధించే వీలుంది.  అయితే  ప్రస్తుతం నాట్లు వేసిన, వేయబోయే పొలంలో సమగ్ర కలుపు , ఎరువుల యాజమాన్యం చేపడితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చుని తెలియజేస్తున్నారు  శ్రీకాకుళం జిల్లా, ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త, డా. డి. చిన్నమనాయుడు.

READ ALSO : Production of Natu Koramenu : నాటు కొరమేను పిల్లల ఉత్పత్తి.. అనుబంధంగా కోళ్లు, బాతుల పెంపకం

భూసార పరీక్షల ఆధారంగానే ఎరువుల యాజమాన్యం చేపట్టాలి .  భూమికి ఎంత మేర పోషకాలు అవసరమో అంతే వేయడం వల్ల పెట్టుబడులు కూడా తగ్గుతాయి. వరికి ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాష్  అధికంగా అవసరమైన పోషకాలు. వీటితో పాటు సూక్ష్మపోషకాల లోపాలు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.

READ ALSO : Aditya-L1 Mission : ఇస్రో మరో కీలక ప్రయోగం.. సూర్యుడి రహస్యాలు కనుగొనేందుకు సిద్ధం, ఆదిత్య – ఎల్1 ప్రయోగం

ఎక్కడైతే సరైన ఎరువుల యాజమాన్యం చేపడతారో అక్కడ చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. ఇటు కలుపు యాజమాన్యంపై కూడా దృష్టి పెడుతే, దిగుబడి పెరగడమే కాకుండా పెట్టుబడులు కూడా తగ్గుతాయి.