Nature Farming : పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం వైపు రైతుల చూపు..

Nature Farming : వినియోగదారుడికి అందించే లక్ష్యంతో సాగులో దూసుకుపోతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో 30కి పైగా వివిధ రకాల పంటలు, కూరగాయలు సాగుచేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.

organic farming

Nature Farming : రైతులు ఏ పంట సాగుచేసినా రసాయన ఎరువులు, పురుగు మందులపై ఆధారపడాల్సి వస్తోంది. అధిక మొత్తం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయి గిట్టు బాటు కాని పరిస్థితులు దాపురించాయి. ఫలితంగా రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. అందుకే చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయంవైపు మొగ్గుచూపుతున్నారు. అధికారుల సహకారం కూడా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఈ సాగు విధానం పాటిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు గడిస్తున్నారు.

Read Also : Paddy Cultivation : వరిలో అగ్గి తెగుళ్ల ఉధృతి – నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు  

మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే పెద్దలు అన్నారు వంటిల్లే పెద్ద వైద్యశాల అని. అదే సూత్రాన్ని ఆచరిస్తున్నారు ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని పలువురు రైతులు.ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించడమే కాకుండా, వినియోగదారుడికి అందించే లక్ష్యంతో సాగులో దూసుకుపోతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో 30కి పైగా వివిధ రకాల పంటలు, కూరగాయలు సాగుచేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న అధికారులు : 
సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేసే రైతులు మితిమీరి వినియోగిస్తున్న రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల ఉత్పాదకత తగ్గడమే కాకుండా..  అనారో గ్యానికి గురవుతున్నారు. ప్రకృతి సాగులో ఆ పరిస్థితి కన్పించడంలేదు. అందుకే రావిచర్ల గ్రామానికి చెందిన రైతు వెంకట కృష్ణ ప్రసాద్ మూడేళ్లుగా ప్రకృతి విధానంలో వరి, మొక్కజొన్నతో పాటు మామిడి పంటలను పండిస్తున్నారు. స్థానికంగా దొరికే వనరులనే ఉపయోగించి ఎరువులు, కషాయాలను తయారుచేసి పంటలకు అందిస్తూ… నాణ్యమైన దిగుబడులను పొందుతున్నారు. వచ్చిన దిగుబడులను స్థానికంగా అధిక ధరకు అమ్ముతూ.. మంచి లాభాలను పొందుతున్నారు.

ప్రకృతి వ్యవసాయం ప్రస్తుత వ్యవసాయ విధానాలకు సరి­యైన లాభసాటి ప్రత్యామ్నాయ విధానం. అధిక దిగుబడి, అత్యున్నత జీవనోపాధి, సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందని ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు అంటున్నారు. గ్రామాల్లో సేంద్రియ ఎరువులు, ఘన, ద్రవ జీవామృతాలు, కషాయాల తయారీపై రైతులకు అవగాహన కల్పిస్తూ.. పంటల సాగులో సలహాలు, సూచనలు అందిస్తూ.. పెట్టుబడి లేని సాగు విధానాన్ని ముందుకు తీసుకెళుతున్నారు.

గ్రామీణ జీవనోపాధి, పౌష్టికాహారం, జీవ వైవిధ్య నష్టం, వాతావరణ మార్పు, నీటి కొరత, కాలుష్యం వంటి బహుళ అభివృద్ధి సవాళ్లను ప్రకృతి సాగు చేస్తున్న రైతులు అధిగమిస్తున్నారు. అందుకే ఈ సాగు విధానాన్ని పరిశీలించేదుకు ప్రాన్స్ దేశం నుండి ఓ కంపెనీ ప్రతినిధి జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రకృతి విధానంలో సాగుచేసే రైతుల పంట పొలాలు తిరుగుతూ.. వారు అవలంబిస్తున్న పద్ధతులను తెలుసుకుంటున్నారు.

Read Also : Inter Crop Cultivation : 2 ఎకరాల్లో బొప్పాయి.. ఎకరంలో బంతి సాగు.. ఆదాయం రూ. 23 లక్షలు

ట్రెండింగ్ వార్తలు