Horticultural Crops : ఉద్యాన పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్యం

Horticultural Crops : అంతేకాకుండా చీడ పీడలు మరియు తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం కలగజేస్తున్నాయి. మరోవైపు కలుపు సమస్య కూడా పెరిగిపోయింది.

horticultural crop production and management in telugu

Horticultural Crops : ఇటీవల కురిసిన వర్షాల వల్ల అక్కడక్కడ ఉద్యాన పంటల్లో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా పండ్లు, కూరగాయ తోటల్లో నీరు ఎక్కువ రోజులు నిల్వవుండటం వల్ల పంటలు ఎదుగుదల లోపించడమే కాకుండా, తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి రైతులు వాటిని కాపాడుకునేందుకు మేలైన సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విఙ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. సునీల్ కుమార్.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

ప్రతికూల పరిస్థితుల కారణంగా ఉద్యాన పంటల్లో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఉద్యాన పంటల్లో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల మొక్కల వేర్లకు గాలి, సూర్యరశ్మి అందలేదు. దీంతో కిరణజన్య సంయోగక్రియ సరిగా జరగక పోవడం .. మొక్కలు ఎర్రబడి చనిపోయే ఆస్కారం ఉంది.

అంతేకాకుండా చీడ పీడలు మరియు తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం కలగజేస్తున్నాయి. మరోవైపు కలుపు సమస్య కూడా పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో పండ్లు, కూరగాయల తోటల్లో ప్రస్తుతం చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విఙ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. సునీల్ కుమార్.

Read Also : Paddy Crop : వరి పొలాల్లో అధికంగా యూరియా వాడుతున్న రైతులు – అవసరం మేరకే వాడాలంటున్న శాస్త్రవేత్తలు

ట్రెండింగ్ వార్తలు