Boda Kakarakaya Cultivation : ఆకాకర సాగుతో అధిక లాభాలు

Boda Kakarakaya Cultivation : వర్షాకాలం సీజన్లో ఎక్కువగా కనిపించే కూరగాయ ఆ కాకరకాయ. సైజు చిన్నగానే ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా ఎక్కువే.

Huge Profits In Boda Kakarakaya Cultivation

Boda Kakarakaya Cultivation : రైతు లాభాల బాట పట్టాలంటే రాజు లాంటి పంట ఆ కాకర ఉత్తమమైనది. దీనిని కొన్ని ప్రాంతాలలో బోడ కాకర అని కూడా అంటారు. ఈ పంట వేస్తే రైతు ఇంట్లో కాసుల వర్షం కురవాల్సిందే. ఈ బోడ కాకర కాయలో ప్రోటీన్లు అధికంగా ఉండడంతో పాటు ఔషధ గుణాలు అధికంగా ఉండడంతో, దీనికి మార్కెట్లో ఎప్పుడు డిమాండ్ తగ్గదు. వరి మొక్కజొన్న పంటలకు నిలయమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో.. ఓ రైతు వినూత్నంగా ఆలోచించి కాసుల వర్షం కురిపిస్తున్నాడు.

Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..

వర్షాకాలం సీజన్లో ఎక్కువగా కనిపించే కూరగాయ ఆ కాకరకాయ. సైజు చిన్నగానే ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా ఎక్కువే. అందుకే మార్కెట్ లో దినికి డిమాండ్ ఎక్కువ. దీనినే ఆసరాగా చేసుకొని ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం మండలం, అచ్చుతాపురం గ్రామానికి చెందిన ఎలిబండి నాగేశ్వరరావు మిగితా రైతుల కంటే వినూత్నంగా ఆలోచించి బోడ కాకరకాయను ఎకరంలో సాగుచేస్తున్నారు.

శాశ్వత పందిరి విధానంలో డ్రిప్ ద్వారా సాగుచేస్తున్న రైతు.. ప్రతి 10 ఆడ మొక్కలకు ఒక మొగ మొక్కను ఉండేవిధంగా చర్యలు తీసుకున్నారు. పంట పెరుగుదల సమయంలో తాళ్ళ సహాయంతో తీగలను పందిరి పైకి పాకిస్తున్నారు. విత్తనం నాటిన 50 నుండి 60 రోజులకు పూత , కాత ప్రారంభమవుతుంది. దిగుబడి ప్రారంభమైన 4 నెలలపాటు పంట కోస్తున్నారు. మార్కెట్ లో మంచి ధర పలుకుతుండటంతో లాభాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి.

ఈ పంట సాగకు మొదటి పెట్టుబడి అధికమైన… మొదటి పంటతోనే మొత్తం పెట్టుబడి చేతికి వస్తుంది. రెండో పంట నుండి పూర్తిగా నికర ఆదాయమే. ఇతర పంటలతో పోల్చితే మార్కెట్ లో నిలకడైన అధిక ధర ఉంటుంది. కాబట్టి ఎకరాకు మూడు నెలల్లోనే దాదాపు 3 నుండి 4 లక్షల నికర ఆదాయం ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

Read Also : Honey Harvesting : స్వయం ఉపాధిగా తేనెటీగల పెంపకం – ఏడాదికి రూ. 5 లక్షల నికర ఆదాయం