Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..

Agriculture Tips : పంటలకు జీవం పోసి ఆదరువు అవుతాయనుకున్న వర్షాలు.. దంచికొడుతూ చేలను ముంచెత్తుతున్నాయి. రైతులకు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి.

Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..

Agricultural Water Management With Sustainable Methods

Updated On : September 28, 2024 / 2:47 PM IST

Agriculture Tips : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో నీరు నిలుస్తోంది. వర్షం నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్ల మొక్కల వేర్లకు గాలి, సూర్యరశ్మి అందక ఎర్రబారి చనిపోతాయి. చీడపీడలు, తెగుళ్లు బారిన పడే అవకాశముంటుంది.  ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఉద్యాన పంటలు పండిస్తున్న రైతులు పలు జాగ్రత్తలు పాటించాలని ఉద్యాన వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

పంటలకు జీవం పోసి ఆదరువు అవుతాయనుకున్న వర్షాలు.. దంచికొడుతూ చేలను ముంచెత్తుతున్నాయి. రైతులకు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి. కొద్దిరోజుల కిందట కురిసిన వర్షాల నుంచి తేరుకోక ముందే మళ్లీ కురుస్తున్న వర్షాలు రైతులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యాన పంటలైన కూరగాయలు, పండ్లతోటలకు తీవ్రనష్టం కలిగే సూచనలున్నాయి.

వీలైనంత వరకు పంట పొలాల్లో వర్షం నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణంలో అధిక తేమ వల్ల పంటలకు తెగుళ్లు సోకే అవకాశముంటుంది.  ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన సమగ్ర యాజమన్యం గురించి  రైతులకు తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం  శాస్త్రవేత్త సుచిత్ర.

Read Also : Leaf Crops Farming : తక్కువ ఖర్చుతో తీగజాతి పంటలు సాగుచేస్తున్న రైతులు