Leaf Crops Farming : తక్కువ ఖర్చుతో తీగజాతి పంటలు సాగుచేస్తున్న రైతులు

Leaf Crops Farming : ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయలకు భళే డిమాండ్‌ ఉంది. కూరగాయల పంటలను సాగు చేసిన రైతులు ఏడాది పొడువునా ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి.

Leaf Crops Farming : తక్కువ ఖర్చుతో తీగజాతి పంటలు సాగుచేస్తున్న రైతులు

High Profit With Crops

Updated On : September 28, 2024 / 2:41 PM IST

Leaf Crops Farming : తక్కువ సమయంలో చేతికొచ్చే పంట కూరగాయలు. వీటిని నేలపై సాగుచేస్తే అధికంగా చీడపీడల ఆశించి పెట్టుబడులు పెరుగుతాయి. అంతే కాదు నాణ్యమైన దిగుబడులు రావు. ఇది గమనించిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొందరు రైతులు.. స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించి శాశ్వత పందిళ్లు వేసుకొని తీగజాతి కూరగాయలను సాగుచేస్తున్నారు. పంట వెనుక పంటను వేస్తూ ..  నాణ్యమైన అధిక దిగుబడులను తీస్తూ.. మంచి లాభాలను పొందుతున్నారు.

Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

ఇక్కడ చూడండి… పందిరి కూరగాయల సాగు. ఎత్తైన బెడ్లపై నిండుగా అల్లుకున్న ఈ పంటలు దొండ, బీర, చిక్కుడు . ఇప్పుడిప్పుడే పూత , కాత తె ఉన్న ఈ తోటలు పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లి మండలం, వెంకటరామన్న గూడెంలో ఉన్నాయి. కొన్నేళ్లుగా పందిరి కూరగాయల సాగుచేస్తున్నారు  రైతులు. అయితే ప్రణాళిక బద్ధంగా పంటల వెనుక పంటలు వేస్తూ.. ఏడాదికి మూడు పంటలు సాగుచేస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయలకు భళే డిమాండ్‌ ఉంది. కూరగాయల పంటలను సాగు చేసిన రైతులు ఏడాది పొడువునా ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని, రైతులు..  ఎకరా, రెండెకరాలలో స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించి పందిర్లను ఏర్పాటు చేసుకున్నారు. బోదెల పద్ధతిలో తీగజాతి కూరగాయలను సాగుచేస్తున్నారు. ఇలా సాగుచేస్తున్న రైతుల్లో సూర్యచందర్ రావు ఒకరు. తనకున్న భూమిలో ఎకరం విస్తీర్ణంలో దొండ సాగుచేస్తూ… మంచి లాభాలను పొందుతున్నారు.

ఇదేగ్రామనికి చెందిన రైతులు గోకరాజు, కొండలరావులు కూడా తీగజాతి కూరగాయలే సాగుచేస్తున్నారు.  ఒకరు బీరసాగుచేస్తుండగా.. మరొకరు చిక్కుడు సాగుచేస్తున్నారు. అయితే వచ్చిన దిగుబడులను స్థానిక మార్కెట్లలో వ్యాపారులకు అమ్ముతూ.. ప్రతి నిత్యం ఆదాయం పొందుతున్నారు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు