Sunflower crop Cultivation : పొద్దుతిరుగుడు పంట.. లాభాలు ఇంట

ఈ కోవలోనే కృష్ణా జిల్లా, రెడ్డిగూడెం మండలం, కూనపరాజు పర్వ గ్రామానికి చెందిన రైతు చల్లా రాధాకృష్ణ ప్రయోగాత్మకంగా 30 ఎకరాల్లో సాగుచేశారు. ప్రస్తుతం క్రాసింగ్ దశలో ఉంది. అయితే హైబ్రిడ్ పొద్దుతిరుగుడు విత్తనోత్పత్తిలో ఆడ, మగ వరసలను సంకర పరిచే విధానంలో తప్ప, మిగతా యాజమాన్య పద్ధతులన్నీ కమర్షియల్ పొద్దుతిరుగుడు లాగే ఉంటాయంటున్నారు రైతు చల్లా రాధాకృష్ణ.

Sunflower crop Cultivation : పంటల సాగులో అన్నదాతల ధోరణి మారుతుంది. పెరిగిన పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులతో సంప్రదాయ పంటల పట్ల రైతులు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ రిస్క్ .. అధిక లాభాలొచ్చే పంటలవైపు మొగ్గుచూపుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు ప్రైవేట్ విత్తన కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోని పొద్దుతిరుగుడు పంటను సాగుచేస్తున్నారు. తక్కువ సమయంలోనే.. అధిక లాభాలు వస్తున్నాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO : Sunflower Seed Production : రైతులకు ఆశాజనకంగా పొద్దుతిరుగుడు విత్తనోత్పత్తి !

వంటనూనెల దిగుమతుల్లో భారతదేశం ప్రపంచదేశాలన్నిటి కంటే ముందుంది. దేశ అవసరాలకు తగ్గ ఉత్పత్తి లేకపోవటం వల్ల  ఏటా, వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, దిగుమతుల కోసం , ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఆర్ధికంగా ఇది దేశానికి పెనుభారంగా మారింది . ఆయిల్ పామ్, ఆవాలు, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, సోయాబీన్, వేరుశనగ వంటి నూనెలు , ప్రధానంగా ఈ దిగుమతుల్లో వున్నాయి. ఏటా దిగుమతులు పెరగటమేకానీ తగ్గే పరిస్థితులు కనిపించటం లేదు.

అయితే ఇటీవల కాలంలో ఈ పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు, ప్రభుత్వాలు ప్రోత్సహకాలు అందిస్తున్నాయి.  తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నూనె పంటల్లో,  ఏడాది పొడవునా, అన్నికాలాల్లో సాగుచేయదగ్గ పంట ప్రొద్దుతిరుగుడు. అందుకే చాలా మంది ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపధ్యంలో కొన్ని విత్తన కంపెనీలు.. విత్తన ఉత్పత్తి కోసం రైతులతో భైబ్యాక్ ఒప్పందం చేసుకొని వారిచేత సాగుచేయిస్తున్నారు.

READ ALSO : Sunflower Cultivation : పొద్దుతిరుగుడు సాగులో తెగుళ్ళు…యాజమాన్యం

ఈ కోవలోనే కృష్ణా జిల్లా, రెడ్డిగూడెం మండలం, కూనపరాజు పర్వ గ్రామానికి చెందిన రైతు చల్లా రాధాకృష్ణ ప్రయోగాత్మకంగా 30 ఎకరాల్లో సాగుచేశారు. ప్రస్తుతం క్రాసింగ్ దశలో ఉంది. అయితే హైబ్రిడ్ పొద్దుతిరుగుడు విత్తనోత్పత్తిలో ఆడ, మగ వరసలను సంకర పరిచే విధానంలో తప్ప, మిగతా యాజమాన్య పద్ధతులన్నీ కమర్షియల్ పొద్దుతిరుగుడు లాగే ఉంటాయంటున్నారు రైతు చల్లా రాధాకృష్ణ.

పొద్దుతిరుగుడు పంట సాగు చేయడానికి తక్కువ నీరు అవసరం ఉంటుంది. దాదాపు 15 రోజులకు ఒక్కసారి పంటకు నీటి తడిని అందిస్తే సరిపోతుంది. ఒక ఎకరానికి 7 నుంచి 11 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వస్తుంది. అయితే పశువులు, పక్షుల నుంచి పంటను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్ లో కూడా మంచి ధర పలుకుతుండటంతో తక్కువ సమయంలోనే అధిక లాభాలు పొందవచ్చు.

READ ALSO : Sunflower Cultivation : పొద్దుతిరుగుడు సాగులో అధిక దిగుబడులకోసం…

పొద్దుతిరుగుడు సాగులో అన్ని ఖర్చులు పోను ఎకరాకు 45 నుండి 50 వేల రూపాయల నికర ఆదాయం వస్తోంది. దీంతో కమర్షియల్ పొద్దుతిరుగుడు పంట కంటే  హైబ్రిడ్ పొద్దుతిరుగుడు విత్తనోత్పత్తి లాభదాయకంగా వుందని రైతు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు