Pests In Turmeric : పసుపులో తెగుళ్లు, చీడపీడల నివారణ చర్యలు!

దుంప తొలుచు ఈగ పిల్ల పురుగులు తెల్ల రంగులో బియ్యం గింజ వలే ఉండి భూమిలో ఉన్న దుంపల్లోకి చొచ్చుకొనిపోయి దుంపను నాశనం చేస్తాయి. ఈ పురుగు వల్ల సుడి ఆకు దాని దగ్గరలో ఉండే లేత ఆకులు వాడి గోధుమ రంగులో మారి ఎండి పోయి రాలిపోతాయి.

Turmeric Pest Management

Pests In Turmeric : సుగంధ ద్రవ్యాల పంటల్లో పసుపు ఒకటి. మనదేశంలో పసుపును ప్రధానమైన పంటగా సాగుచేస్తున్నారు. మన భారతదేశంలో పసుపును ఎక్కువ విస్తీర్ణంలో సుమారు 50 శాతం వరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోనే పండిస్తున్నారు. పసుపును ఆహారపదార్ధాలతోపాటు, సుగంధ ద్రవ్యాలు ,ఔషదాల తయారీలో వినియోగిస్తున్నారు. మార్కెట్లో పసుపుకు మంచి డిమాండ్ ఉండటంతో రైతులు పసుపు సాగువైపు ఆసక్తి చూపుతున్నారు. పసుపు సాగు చేయాలనుకునే రైతులు పంట బాగా ఉండాలంటే జాగ్రత్తలు పాటించటం వల్ల పంట దిగుబడిని చీడపీడల నుండి కాపాడుకోవచ్చు.

పసుపు పంటకు ఎక్కువగా వచ్చే తెగుళ్ళు ;

ఆకుమచ్చ తెగులు ; ఆకుమచ్చ తెగులును తాటాకు తెగులు అని కూడా అంటారు. గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండి సూర్యరశ్మి తక్కువ ప్రసరించినప్పుడు, వర్షాలు ఏకధాటిగా కురిసినప్పుడు ఈదురుగాలులు ఎక్కువగా వచ్చినప్పుడు ఆకుమచ్చ తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు వల్ల ఆకుపై ముదురు గోధుమ రంగులో మచ్చలు ఏర్పడతాయి. అవి మెల్లమెల్లగా మచ్చల పరిమాణం పెరుగుతూ ఆకు మొత్తం విస్తరించి ఆకు పూర్తిగా ఎండిపోతుంది. ఈ తెగులు సోకినా మొక్కల ఆకులను పంటచేను నుండి తొలగించి మంటలో కాల్చి చెయ్యాలి. ఎలా చేయడం వల్ల మిగిలిన మొక్కలకు తెగులు వ్యాప్తి చెందకుండా ఉంటుంది. దీని నివారణకు పైరక్లోస్ట్రోబీన్ 20% WG ఐ మీ.లీ / 1 లీటర్ నీటికి లేదా టేబుకొనజోల్ 50% + ట్రీఫ్లొక్షిస్ట్రోబీన్ 25% WG 2 గ్రా” / 1 లీటర్ నీటికి కలుపుకుని పిచికారి చేయాలి.

దుంప కుళ్ళు తెగులు ; ఈ దుంప కుళ్ళు తెగులు పసుపు పంట దిగుబడిని చాల వరకు దేబ్బతిస్తుంది. ఇది పంటచేనులో మురుగు నీరు కానీ, ఎక్కువ రోజులు నిల్వ ఉన్న నీటిలో ఈ తెగులు ఉదృతంగా వ్యాప్తి చెందుతుంది కావున ఆ నీటిని తొలగించాలి. దుంప ఊరే సమయాల్లో వర్షాలు పడ్డ కూడా మట్టిలో తేమశాతం ఎక్కువ ఉండటం వల్ల సులువుగా వ్యాప్తి చెందుతుంది. విత్తనం వితుకున్కే ముందు విత్తనశుద్ది చెయ్యడం మంచిది. సరైన సమయాల్లో పోషక ఎరువులను అందించాలి. దీని నివారణకు మేటాలాక్సిల్ 2 గ్రా. లేదా రిడోమిల్ 2 గ్రా. 1 లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదలు వద్ద నేల తడిచేల పొయ్యాలి.

ఎర్రనల్లి ; తల్లి పిల్ల పురుగులు మొదట ఆకులు అడుగుభాగాన గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు వడిలిపోయి రాలిపోతాయి. దీని నివారణకు ఒక లీటర్ నీటిలో మూడు గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా 3 మిల్లీ.లీటర్ల టైకోఫాల్ మందులతో సాండో విట్ 1 మిల్లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

దుంప తొలుచు ఈగ : దుంప తొలుచు ఈగ పిల్ల పురుగులు తెల్ల రంగులో బియ్యం గింజ వలే ఉండి భూమిలో ఉన్న దుంపల్లోకి చొచ్చుకొనిపోయి దుంపను నాశనం చేస్తాయి. ఈ పురుగు వల్ల సుడి ఆకు దాని దగ్గరలో ఉండే లేత ఆకులు వాడి గోధుమ రంగులో మారి ఎండి పోయి రాలిపోతాయి. పుచ్చిన దుంపలో బియ్యపు గింజను పోలిన పురుగులు ఉంటాయి. మువ్వును పీకినట్లయితే సుడిలాగా ఊడివస్తుంది. దీని నివారణకు ఎకరాకు 100 కిలోల వేపపిండిని మొక్క మధ్యలో వేయాలి. లేదా వేప పిండిని వేయలేని సమయంలో 10 కిలోల కార్బో ప్యురాన్ 3 జి గుళికలను అదే పరిమాణం గల ఇసుక తో కలిపి ఒక ఎకరం పొలంలో సమపాళ్ళలో చల్లాలి.

ఆకు పురుగు : ఈ పురుగు లార్వా ఆకులను కత్తిరించి వేస్తూ మడిచి దానిలోనే జీవిస్తూ ఆకులను తింటూ బతుకుతుంది. ఈ పురుగు నివారణకు 1.6 మి.లీ లేదా మోనోక్రోటోఫాస్ లేదా కార్బరిల్ 0. 1 శాతం ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.

ట్రెండింగ్ వార్తలు