Mixed Cropping : 5 ఎకరాల్లో మిశ్రమ పంటల సాగు.. 365 రోజులు దిగుబడులు

Mixed Cropping : వ్యవసాయంలో దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక పంటల సాగు విధానాలను రైతులు పాటిస్తుంటారు. దీర్ఘకాలిక పంటల జాబితాలో పండ్ల తోటలు ప్రధానంగా ఉంటాయి.

Mixed Cropping

Mixed Cropping : పండ్ల తోటలను సాగుచేసే రైతులు.. ఏడాదికి ఒక సారే దిగుబడులను పొందుతుంటారు. అలాంటి రైతులు నిరంతరం ఆదాయం పొందేందుకు..  అంతర పంటలు దోహద పడుతుంటాయి. అందులో పెట్టుబడి తగ్గించే పద్ధతులు  విధానాలు అవలంబిస్తే… అధిక లాభాలను పొందే విలుంటుంది. ఈ పద్ధతుల పట్ల రైతులకు అవగాహన కల్పిస్తూ.. వారిచేత మిశ్రమ పంటలు సాగు చేయిస్తూ… ముందుకు సాగుతున్నారు కృష్ణా జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం .

వ్యవసాయంలో దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక పంటల సాగు విధానాలను రైతులు పాటిస్తుంటారు. దీర్ఘకాలిక పంటల జాబితాలో పండ్ల తోటలు ప్రధానంగా ఉంటాయి. పండ్లతోటలు సాగు చేసే రైతులు ఆయా పంటల నుండి దిగుబడి పొందాలంటే కనీసం ఒక సంవత్సరంపైనే ఎదురు చూడవలసి ఉంటుంది.

ముఖ్యంగా మామిడి, బత్తాయి, కొబ్బరి లాంటి పంటలు సాగు చేసే రైతులయితే తోటలలో దిగుబడి పొందాలంటే కనీసం 3 సంవత్సరాలు ఎదురు చూడవలసి వస్తుంది. ఇలాంటి పంటలు సాగు చేసే రైతులకు ప్రతినిత్యం ఆదాయం అందుబాటులో లేకపోవడం వలన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

ఈ సమస్యకు పరిష్కారంగా వ్యవసాయ అనుబంధ రంగాలను ఆశ్రయించటం, అంతర పంటలు సాగు చేయడం లాంటి ఎన్నో విధానాలను వివిధ ప్రాంతాలలోని రైతులు తమకు అనుకూలంగా సాగు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ అంతర పంటల విధానాన్ని కొద్దిగా మార్పులు చేసి కొంత శాస్త్రీయత జోడించి భూమిని సక్రమంగా సద్వినియోగంతో పాటు రైతులకు పలు రకాలుగా ఉపయోగకరంగా ఉండే పద్ధతులను కృష్ణా జిల్లా, ప్రకృతి వ్యవసాయ విభాగం చెందిన వారు ప్రధాన పంటల్లో అంతర పంటల సాగు మోడల్‌ నమూనాను రైతులకు పరిచయం చేస్తున్నారు.

ఈ మోడల్‌లో రైతు ప్రతినిత్యం పంటల సాగు నుంచి ఆదాయం గడించవచ్చు.  ఇలాంటి మోడల్ నే కృష్ణా జిల్లా, ముర్సిపుడి గ్రామంలోని రైతు వెంకటరావు క్షేత్రంలో ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇప్పుడిప్పుడే దిగుబడుడులు ప్రారంభమవుతున్నారు.

Read Also : Organic Farming : ఆర్గానిక్ పంటల సాగులో అనంత రైతు ఆదర్శం