Sugarcane Farming : చెరకు సాగులో ఎరువుల యాజమాన్యం
సేంద్రియ ఎరువులు లభ్యంకాని ప్రదేశాలలో 60 రోజుల వయస్సు నేలలో పచ్చిరోట్ట పైర్లు అయిన లెగ్యూం జాతికి చెందిన జనుము, పిల్లిపెసర, అలసంద మరియు గ్లెరిసీడియా వండి వాటిని పెంచి పుతకు రాక ముందు కలియదున్నాలి.
- Guntupalli Ramakrishna
- Published On : February 16, 2022 / 05:58 PM IST
Sugarcane Farming (1)
Sugarcane Farming : చెరుకు పంట అధిక వర్షపాతం, సూర్యరశ్మి, గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పండుతుంది. జూన్ నెల నుండి జులై నెల చివర వరకు చెరుకు గడ సాగుకి అనుకూలంగా ఉంటుంది. నేలలు స్వభావం, నీటి లభ్యత, పంట కాలపరిమితి మీద చెరకులో ఎరువుల యాజమాన్యం ఆధారపడి ఉంటుంది. రసాయనిక ఎరువుల మోతాదును సేంద్రియ ఎరువులను వాడటం ద్వారా కొంత వరకు తగ్గించువచ్చు. ఎకరానికి 5 నుండి 6 టన్నుల బాగా ఎండిన ఫిల్టరుమడ్డిని ఫిల్దరుమడ్డి దొరుకు ప్రాంతాలలో నేలలో వేసి కలియ దున్నాలి. ఇలా చేయడం వల్ల ఒక టన్ను ఫిల్దరుమడ్డి వలన 17 కిలోల నత్రజని, 7 కిలోల భాస్వరం, 2 కిలోల పోటాష్ ను పంటకు అందించవచ్చు.
సేంద్రియ ఎరువులు లభ్యంకాని ప్రదేశాలలో 60 రోజుల వయస్సు నేలలో పచ్చిరోట్ట పైర్లు అయిన లెగ్యూం జాతికి చెందిన జనుము, పిల్లిపెసర, అలసంద మరియు గ్లెరిసీడియా వండి వాటిని పెంచి పుతకు రాక ముందు కలియదున్నాలి.ఒక ఎకరా చెరకు పంటకు 40 కిలోల భాస్వరం, 100 కిలోల నత్రజని మరియు 48 కిలోల పోటాష్ లను అందించే ఎరువులను వేసుకోవాలి. నాటిన 45 నుండి 60 రోజులకు మరియు 90 రోజులకు మొక్కల మొదళ్ళ మధ్య 5 సెంటిమీటర్ల లోతులో సమపాళ్ళలో నత్రజని ఎరువులను వేసి మట్టి కప్పాలి.
భాస్వరం; నేలలో ఎకరాకు 12 కిలోల కన్నా తక్కువ భాస్వరం ఉన్నప్పుడు, ఆఖరి దుక్కిలో, ఎకరాకు 40 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులను వేసి కలియదున్నాలి. 3 కిలోల ఫాస్ఫోబాక్టీరియా ను ముచ్చెలు నాటిన తరువాత 6వ రోజున ఒక ఎకరాకు వేసుకుంటే భాస్వరపు ఎరువులలో సుమారు 25% వరకు ఆదా చేసుకోవచ్చు.
పోటాష్; ఆఖరి దుక్కిలో 48 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులను నేలలో తక్కువగా పోటాష్ ఉన్నప్పుడు వేయాలి.
నత్రజని ; నత్రజనిని అందించే జీవన ఎరువులైన అజటోబాక్టర్ ను ఎకరాకు 2 కిలోలు లేదా అజోస్పైరిల్లం ను ఎకరాకు 4కిలోలు, 500 కిలోల పశువుల ఎరువుతో కలిపి 2 దఫాలుగా నాటిన 3వ రోజున సగబాగం మరియు మిగిలిన సగభాగాన్ని45వ రోజుల సమయంలో వేసుకుంటే నత్రజని ఎరువులను ఆదా చేసుకోవచ్చు.
జింక్ ధాతు లోపం ; ఈ లోపం కనిపించిన మొక్కలలో ఆకుల ఈనెల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడి, లోపం ఎక్కువైనపుడు పెరుగుదల నిలిచిపోతుంది మరియు దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు నిర్వీర్యం అవుతాయి. ఈ లోపం కనిపించిన తోటకు వారం వ్యవధిలో లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్పేట్ ను 2 సార్లు పిచికారి చేయాలి. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ను నేలలో వేసి కలియ దున్నడం వలన నివారించుకోవచ్చు.
ఇనుప ధాతు లోపం ; దీని వలన ఆకులు పాలిపోయినట్టు అయిపోయి లేత పసుపు రంగు నుండి తెలుపు రంగులోకి మారతాయి. ఈ లక్షణాలు ఈనెల మధ్య భాగంలో ఏర్పడతాయి. ఇనుప ధాతు లోపం కనిపించిన వెంటనే 10 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ మరియు 2 గ్రాముల నిమ్మ ఉప్పును లీటరు నీటికి చొప్పున కలిపి మొక్కలపై వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసి లోపాన్ని సరిదిద్దుకోవచ్చు.
