Fertiliser Management in Maize
Fertiliser Management in Maize : తెలుగు రాష్ట్రాలలో వరి తర్వాత అధిక విస్థీర్ణంలో సాగయ్యే ఆహారపంట మొక్కజొన్న. మెట్టప్రాంతాల్లో వర్షాదారంగా ఖరీఫ్ మొక్కజొన్నను తెలంగాణా జిల్లాల్లో అధిక విస్తీర్ణంలోను, ఆంధ్రప్రదేశ్ లో పరిమితంగా సాగుచేస్తారు. వరిసాగులో పెడుతున్న పెట్టుబడులకు… అందివస్తున్న ఆదాయానికి పొంతన లేకపోవటంతో, అవకాశం వున్నచోట్ల దీని స్థానంలో మొక్కజొన్న విస్తీర్ణం నానాటికీ పెరుగుతోంది.
READ ALSO : Coconut Farming : కొబ్బరి తోటల్లో తొలకరి ఎరువుల యాజమాన్యం.. అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన జాగ్రత్తలు
ప్రస్థుతం అందుబాటులో వున్న పలు హైబ్రీడ్లు ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్ళ వరకు అధిక దిగుబడులు ఇస్తుండటం కూడా ఈపంట విస్తీర్ణం పెరగటానికి కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఖరీఫ్ మొక్కజొన్నను విత్తేందుకు అనువైన సమయం. ఈపంటలో అధిక దిగుబడులు పొందాలంటే సాగు ప్రారంభంలోని ఎరువుల యాజమాన్యం కీలం. మరి ఏఏ సమయంలో ఎరువులను వాడాలో ఇప్పుడు చూద్దాం..
READ ALSO : Cultivation Of Crops : తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు.. వాణిజ్య పంటల స్థానంలో చిరుధాన్యాలే మేలు
స్థిరమైన దిగుబడితో, నమ్మకమైన రాబడినిస్తూ… అనుకూల పరిస్థితుల్లో రైతుకు ఆశించిన ఫలసాయాన్నందిస్తోంది మొక్కజొన్న పంట. అందుకే ఏటా దీని విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. వరిసాగుతో పోలిస్తే నీటి అవసరం తక్కువగా వుండటం, సాగు ఖర్చులు ఎకరాకు 15 నుంచి 25వేలకు మించకపోవటం, కూలీల అవసరం తక్కువగా వుండటంతో రైతులకు మొక్కజొన్న సాగు ఆశాజనకంగా వుంది. రబీ కాలంతో పోలిస్తే ఖరీఫ్ లో వర్షాదారంగా కొంత దిగుబడి తగ్గినప్పటికీ ఇతర పంటలతో పోలిస్తే మొక్కజొన్నలో ఫలితాలు ఆశాజనకంగా వున్నాయి. మొక్కజొన్నలో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రకాలు రైతులకు అందుబాటులో వున్నాయి. రకాన్నిబట్టి ఇవి 95 నుంచి 110 రోజుల్లో పంట చేతికొస్తుంది. వీటితోపాటు అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాల సాగుకు రైతులు ఎక్కువ ఆసక్తిచూపుతున్నారు.
READ ALSO : Cultivation Of Kharif Crops : ఖరీఫ్ అపరాల సాగులో యాజమాన్యం
తెలుగురాష్ర్టాలలో వర్షధారంగా మొక్కజొన్నను జూన్15 నుంచి జూలై15 వరకు విత్తుకోవచ్చు. దీనిసాగుకు నీరు ఇంకిపోయే బంకనేలలు, ఎర్రనేలలు, ఒండ్రు కలిగిన ఇసుకునేలలు అనుకాలంగా వుంటాయి. సాగు ప్రారంభంలో ఎరువుల యాజమాన్యం కీలంకం కాబట్టి.. ముందుగా నేలను 3,4సార్లు బాగా దున్ని, ఆఖరిదుక్కిలో బాగా చివికిన పశువులఎరువు 10 టన్నులు వేసి, కలియదున్నుకోవాలి.
READ ALSO : Irrigation Management : మొక్కజొన్నలో రైతులు అనుసరించాల్సిన నీటి యాజమాన్య పద్ధతులు !
ఎకరా మొక్కజొన్నకు 72 నుంచి 80 కిలోల నత్రజని, భాస్వరం 24 కిలోలు, పొటాష్ ఎరువులు 20 కిలోలు, జింక్ సల్ఫేట్ అవసరం అవుతుంది. నత్రజనినిచ్చే ఎరువును మూడు దఫాలుగా వేయాలి. 1/3 వ వంతు విత్తే సమయంలో, 1/3వ వంతు విత్తిన 30 నుంచి 35 రోజులకు, మిగిలిన 1/3 వంతు విత్తిన 50 నుంచి 55 రోజులకు వేసుకోవాలి. ఎరువును మొక్కలకు 5 సెం.మీ దూరంలో, అలాగే 5 సెం.మీ లోతులో వేయాలి . మొత్తం భాస్వరం, సగం పొటాష్ ను ఆఖరిదుక్కిలోనే వేసి కలియదున్నుకోవాలి. పూత దశలో పొటాష్ ఎరువును 1/2వ వంతు వేయాలి. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్‌ను ప్రతి రెండు, మూడు పంటలకొకసారి దుక్కిలో వేసి కలియదున్నితే మంచి దిగుబడలు సాధించే అవకాశం ఉంటుంది.
READ ALSO : Maize Farming : రైతుకు మంచి అదాయవనరుగా మొక్కజొన్నసాగు !
విత్తనశుద్ధి చేసిన మొక్కజొన్నవిత్తనాలను.. బోదెకు ఒక వైపున.. పైనుంచి మూడోవ వంతు ఎత్తులో 20 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. బోదెలు కాలువల పద్ధతిలో పైరుకు నీరు అందించడానికి అధిక నీటిని బయటికి తీయటానికి ఉపయోకరంగా ఉంటుంది. విత్తిన ఒకటి రెండు రోజుల్లో అట్రజిన్ 50శాతం పొడి మందును ఎకరాకు 800-1200 గ్రాములు, 200 లీటర్ల నీటిలో కలిపి తేమ నేలపై పిచికారీ చేయాలి. విత్తిన తర్వాత పొలంలో నీరు నిలిస్తే మొలకరాదు. కావున నీటిని బయటకు తీసివేయాలి.