Coconut Farming : కొబ్బరి తోటల్లో తొలకరి ఎరువుల యాజమాన్యం.. అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన జాగ్రత్తలు
రువులను వేసే పద్ధతిలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎరువులను సక్రమమైన పద్ధతిలో చెట్టు చుట్టూ పళ్ళెంలో వేసినప్పుడే, అవి నేలలోకి ఇంకి, వేర్లు గ్రహించడానికి వీలు పడుతుంది. ఎరువులను సమభాగాల్లో జూన్ - జూలై , సెప్టెంబర్ - అక్టోబర్ మాసాల్లో రెండు దఫాలుగా వేసుకోవాలి.

Coconut Farming
Coconut Farming : కొబ్బరి ఎక్కువగా పండించే రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ ఒకటి. మొత్తం రాష్ట్రంలో 2 లక్షల 60 వేల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. అయితే ఎరువులను మాత్రం ఏడాదికి రెండుసార్లు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తొలకరి వచ్చింది కాబట్టి ఈ నెలలలోనే ఎరువులను వేయాల్సి ఉంటుంది. అయితే కొబ్బరిలో మేలైన అధిక దిగుబడుల పొందాలంటే ఎరువుల యాజమాన్యం చేపట్టాల్సిన మెళకువల గురించి తెలుసుకుందా..
READ ALSO : Cultivation Of Crops : తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు.. వాణిజ్య పంటల స్థానంలో చిరుధాన్యాలే మేలు
కొబ్బరిని దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక , ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సాగవుతుంది . తెలంగాణలోని ఖమ్మం జిల్లాతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కొబ్బరి పంట సుమారు 2 లక్షల 60 వేల ఎకరాల్లో సాగులో ఉంది. విస్తీర్ణంలో సగానికి పైగా ఉభయగోదావరి జిల్లాల్లో, మిగిలిన విస్తీర్ణం ఉత్తర కోస్తా, కృష్ణ, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో సాగవుతుంది. ఉత్పాదకతలో మన రాష్ట్రం ముందు ఉన్నా, ఇంకా దిగుబడి పెంచడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శాస్త్రీయమైన ఆధునిక సేద్య పద్ధతులతో పాటు ఎరువుల యాజమన్యం సాటిస్తే మంచి దిగుబడులను పొందవచ్చు.
READ ALSO : Cultivation Of Kharif Crops : ఖరీఫ్ అపరాల సాగులో యాజమాన్యం
ముఖ్యంగా మొక్క వయసును బట్టి ఎరువులను అందించాలి. 1 నుండి 4 సంవత్సరాల వయసు చెట్లకు అర కిలో యూరియా , 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ , 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ , 20 కిలోల పశువుల ఎరువును వేయాలి. 5 సంవత్సరాల చెట్లకు 1 కిలో యూరియా , 2 కిలో సింగిల్ సూపర్ ఫాస్పేట్ , రెండున్నర కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ , 25 కిలోల పశువుల ఎరువు లేదా 2 కిలోల వేపపిండి వేయాలి.
READ ALSO : Cultivation Of Marigolds : కొబ్బరిలో అంతర పంటగా బంతిపూల సాగు
అయితే ఎరువులను వేసే పద్ధతిలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎరువులను సక్రమమైన పద్ధతిలో చెట్టు చుట్టూ పళ్ళెంలో వేసినప్పుడే, అవి నేలలోకి ఇంకి, వేర్లు గ్రహించడానికి వీలు పడుతుంది. ఎరువులను సమభాగాల్లో జూన్ – జూలై , సెప్టెంబర్ – అక్టోబర్ మాసాల్లో రెండు దఫాలుగా వేసుకోవాలి. చెట్టు కాండానికి 3-5 అడుగుల దూరంలో చుట్టూ గాడిచేసి, ఎరువులను చల్లి, మట్ట్టితో కప్పి వెంటనే నీరు కట్టాలి. మొక్కలకు ఉప్పు వేయుట, వేర్లను నరికి వేయుట మొదలగనవి శాస్త్రీయమైన పద్ధతులు కావు. ఈ చర్యల వల్ల చెట్లకు హాని కలుగుతుంది.