Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్రీడమ్ సేల్.. రూ. 15వేల లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్లపై కిర్రాక్ డిస్కౌంట్లు.. నచ్చిన ఫోన్ కొనేసుకోండి!
Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా అనేక టాప్ 5 స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది.

Flipkart Freedom Sale
Flipkart Freedom Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ మళ్లీ ప్రారంభమైంది. ఈ సేల్ (Flipkart Freedom Sale) సందర్భంగా మీకు నచ్చిన కొత్త స్మార్ట్‌ఫోన్లను కొనేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మీ బడ్జెట్ ధరలోనే కొన్ని టాప్ స్మార్ట్‌ఫోన్‌లు లభ్యమవుతున్నాయి.
అందులో వివో T4x 5G, శాంసంగ్ గెలాక్సీ F16 5G, మోటోరోలా G45 5G, ఒప్పో K13x 5G, రియల్‌మి P3x 5G ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లపై ధర తగ్గింపుతో పాటు బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్, మరెన్నో డిస్కౌంట్లను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో రూ. 15వేల లోపు ధరలో స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు, డిస్కౌంట్లను ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రియల్‌మి P3X 5G :
ఈ రియల్‌మి 5G ఫోన్ (6GB + 128GB) స్టోరేజ్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,999కి విక్రయిస్తోంది. బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డులపై రూ.750 వరకు 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. తద్వారా ఈ ఫోన్ ధర రూ.12,349కు పొందవచ్చు. మీ పాత ఫోన్ ద్వారా ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.10,950 తగ్గించవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీ ఫోన్ మోడల్, ప్రస్తుత వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఉంటుంది.
ఒప్పో K13x 5G :
ఫ్లిప్‌కార్ట్‌లో (6GB+128GB) స్టోరేజ్‌తో ఒప్పో K13x 5G ఫోన్ రూ.12,999కి విక్రయిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా వెయ్యి తగ్గింపుతో లభ్యమవుతుంది. దాంతో ఈ ఫోన్ ధర రూ.11,999కు పొందవచ్చు. మీ పాత ఫోన్ ట్రేడ్ ఆఫర్ ద్వారా ధర రూ.10,950కు తగ్గవచ్చు. మీ పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్ ఆధారంగా తగ్గింపు పొందవచ్చు.
మోటోరోలా G45 5G (Flipkart Freedom Sale) :
ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్‌లో (8GB+128GB) స్టోరేజ్‌తో మోటోరోలా G45 5G ఫోన్ రూ.11,999కే అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై 1,500 తగ్గింపు పొందవచ్చు. ఆ తర్వాత ఫైనల్ ధర రూ.10,499 అవుతుంది. కానీ, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే ధర రూ.11వేలు తగ్గవచ్చు. ఎక్స్ఛేంజ్ కోసం మీ ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్ ద్వారా భారీ డిస్కౌంట్ పొందవచ్చు.
వివో T4x 5G :
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో (6GB+128GB) స్టోరేజ్‌తో వివో T4x 5G ఫోన్ రూ.13,999కే విక్రయిస్తోంది. బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో రూ.500 తగ్గింపు ద్వారా బ్యాంక్ డీల్ ధర రూ.13,499 అవుతుంది. కానీ, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే వివో ఫోన్ ధరను రూ.11,800 తగ్గించవచ్చు. ఈ ఆఫర్ అనేది ప్రస్తుత మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, ఫోన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ F16 5G :
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 5G ఫోన్ (6GB+128GB) స్టోరేజ్ ధర రూ.11,499కు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.750 వరకు 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఆ తర్వాత ధర రూ.10,924 అవుతుంది. పాత ఫోన్ ధరపై ఒకేసారి రూ.9,600 తగ్గింపు పొందవచ్చు. మీ ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి ధర వాల్యూ ఉంటుంది.