Vivo V60 vs Oppo Reno 14 : కొత్త ఫోన్ కావాలా? వివో V60, ఒప్పో రెనో 14 ఏది కొంటే బెటర్? ధర, కెమెరా, ఫుల్ స్పెసిఫికేషన్లు ఇవే..
Vivo V60 vs Oppo Reno 14 : మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లలో వివో V60, ఒప్పో రెనో 14 అద్భుతమైన కెమెరా ఫీచర్లు కలిగి ఉన్నాయి.

Vivo V60 vs Oppo Reno 14
Vivo V60 vs Oppo Reno 14 : మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ల కోసం చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. అద్భుతమైన కెమెరా ఫీచర్లతో కొన్ని బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు (Vivo V60 vs Oppo Reno 14) అందుబాటులో ఉన్నాయి. అందులో
OnePlus, Realme, Oppo, Vivo, iQOO వంటి బ్రాండ్‌ల నుంచి ఆకర్షణీయైన ఫోన్లను ఎంచుకోవచ్చు.
అయితే, ఈ లిస్టులో వివో V60, ఒప్పో రెనో 14 అనే రెండు స్మార్ట్‌ఫోన్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. వివో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వస్తుంటే ఒప్పో మీడియాటెక్ చిప్‌తో వస్తుంది. ఈ రెండు ఫోన్లలో ధర, కెమెరా, స్పెసిఫికేషన్ల ఆధారంగా ఏది కొంటే బెస్ట్ అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వివో V60 vs ఒప్పో రెనో 14 ధర ఎంతంటే? :
ఫ్లిప్‌కార్ట్‌లో వివో V60 ఫోన్ 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ.36,999కు లభిస్తుంది. ఒప్పో రెనో 14 ఫోన్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ 8GB ర్యామ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా మార్కెట్లో రూ.37,999కు లభిస్తుంది. ఆసక్తిగల వినియోగదారులు అదనపు డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లను పొందవచ్చు. తద్వారా ఫోన్ల ధర మరింత తగ్గవచ్చు. వివో V60 అదే స్టోరేజ్ వేరియంట్ ధర రూ.38,999కు ఆఫర్ చేస్తోంది.
వివో V60 vs ఒప్పో రెనో 14 కెమెరాలివే :
వివో V60 ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం వివో ఫోన్ 50MP ఫ్రంట్ స్నాపర్ కలిగి ఉంది. ఒప్పో రెనో 14 విషయానికి వస్తే.. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. OISతో 50MP ప్రైమరీ షూటర్, 50MP టెలిఫోటో షూటర్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 50MP సెన్సార్‌ను కలిగి ఉంది.
వివో V60 vs ఒప్పో రెనో 14 స్పెసిఫికేషన్లు :
వివో V60 ఫోన్ 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ప్యానెల్ 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఈ వివో ఫోన్ అడ్రినో 722 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌తో వస్తుంది.
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.
6500mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఒప్పో రెనో 14 విషయానికొస్తే.. 6.59-అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మాలి G615-MC6 జీపీయూతో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 OSపై కలర్ఓఎస్ 15 స్కిన్‌తో వస్తుంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
ఏ ఫోన్ కొనాలంటే? :
ఈ వివో, ఒప్పో రెండు ఫోన్లలో ఒకేలాంటి కెమెరా సిస్టమ్ ఉన్నాయి. కానీ, ప్రాసెసర్, ఛార్జింగ్ సామర్థ్యం, బ్యాటరీ ఇతర స్పెసిఫికేషన్లలో వివో V60 ఫోన్ బెటర్ అని చెప్పొచ్చు. కెమెరా-ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు. మెరుగైన పర్ఫార్మెన్స్, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ఫోన్ కావాలంటే వివో V60 ఫోన్ కొనేసుకోండి.