Croma Sale 2025 : క్రోమా ఇండిపెండెన్స్ సేల్ 2025.. ఈ స్మార్ట్‌టీవీలు, ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లే ఆఫర్లు.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!
Croma Independence Day Sale 2025 : క్రోమా ఇండిపెండెన్స్ సేల్ 2025 ప్రారంభమైంది. ఈ స్మార్ట్‌టీవీ, ల్యాప్‌టాప్‌లపై బ్యాంకు డీల్స్ అందిస్తోంది.

Croma Sale 2025
Croma Independence Day Sale 2025 : కొత్త స్మార్ట్‌టీవీ, ల్యాప్‌టాప్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? క్రోమా ఇండిపెండెన్స్ డే సేల్ 2025 ప్రారంభించింది. ఈ సేల్ సందర్భంగా (Croma Sale 2025) స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లతో సహా వివిధ ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్ ఆన్‌లైన్, ఫిజికల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. భారతీయ మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇతర ఈ-కామర్స్ దిగ్గజాలతో పోటీగా క్రోమా సేల్ అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది.
క్రోమా డీల్స్, డిస్కౌంట్లు :
ఈ శాంసంగ్ స్మార్ట్‌టీవీ 50Hz రిఫ్రెష్ రేట్‌తో LED 4K అల్ట్రా HD ప్యానెల్‌ను అందిస్తుంది. టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. 20W స్పీకర్‌ను అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ WiFi, Ethernet, 3 HDMI, 1 USB, బ్లూటూత్ 5.2, 1 RF వంటి కనెక్టివిటీ ఆప్షన్లు అందిస్తుంది. క్రోమాలో రూ. 41,900 తగ్గింపు ధరకు లభిస్తుంది. ఈ టీవీ గూగుల్ వాయిస్ అసిస్టెంట్, అలెక్సాకు సపోర్టుతో వస్తుంది.
ఆసుస్ TUF F16 2025 :
క్రోమా స్టోర్‌లో ఈ ల్యాప్‌టాప్ రూ. 69,990 తగ్గింపు ధరకు లభిస్తుంది. ఆసక్తిగల వినియోగదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు. 16GB ర్యామ్, 512GB SSD స్టోరేజీ అందిస్తుంది.
ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
Read Also : Vivo X100 Pro : వివో X100 ప్రో చూశారా? వివో లవర్స్ ఇలాంటి ఫోన్ మిస్ చేయొద్దు.. అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకే..!
16-అంగుళాల FHD+ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఆసుస్ ల్యాప్‌టాప్ NVIDIA GeForce RTX 3050A గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో ఇంటెల్ కోర్ 5 210H ప్రాసెసర్‌ను అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌తో RGB బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ను కూడా కలిగి ఉంది.
లెనోవో ఐడియాప్యాడ్ 3 15IAU7 :
లెనోవో నుంచి వచ్చిన ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల FHD డిస్‌ప్లే కలిగి ఉంది. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా రూపొందించింది. ఎంఎస్ ఆఫీసు హోమ్ 2024 కూడా అందిస్తుంది. ఈ లెనోవో డివైజ్‌లో 8GB ర్యామ్, 512GB SSD స్టోరేజీ ఉన్నాయి. ఇంటెల్ UHD గ్రాఫిక్స్ కార్డ్ కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్ ప్రైమరీ గేమింగ్ అందిస్తుంది. యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే, మల్టీ-టచ్ టచ్‌ప్యాడ్, డాల్బీ ఆడియో సపోర్ట్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.
ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ :
క్రోమాలో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M1 రూ.54,490కి కొనుగోలు చేయొచ్చు. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ.74,900 ఉండగా రూ. 20,410 తగ్గింపు ధరకే లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే.. 13.3-అంగుళాల రెటినా డిస్‌ప్లేతో వస్తుంది. macOS బిగ్ సుర్‌లో రన్ అవుతుంది. ఈ ల్యాప్‌టాప్ 8GB ర్యామ్, 256GB SSD స్టోరేజ్‌తో ఆపిల్ M1 ప్రాసెసర్‌ను అందిస్తుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్, ఫేస్‌టైమ్ HD క్యామ్, టచ్ ఐడీ సెన్సార్ వంటి ఫీచర్లతో కూడా చూడవచ్చు.