Vivo X100 Pro : వివో X100 ప్రో చూశారా? వివో లవర్స్ ఇలాంటి ఫోన్ మిస్ చేయొద్దు.. అమెజాన్‌లో డిస్కౌంట్‌ ధరకే..!

Vivo X100 Pro : వివో X100 ప్రో ధర తగ్గింది. అమెజాన్‌లో సరసమైన ధరకే లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?

Vivo X100 Pro : వివో X100 ప్రో చూశారా? వివో లవర్స్ ఇలాంటి ఫోన్ మిస్ చేయొద్దు.. అమెజాన్‌లో డిస్కౌంట్‌ ధరకే..!

Vivo X100 Pro

Updated On : August 14, 2025 / 10:49 AM IST

Vivo X100 Pro : వివో అభిమానుల కోసం అద్భుతమైన ఆఫర్.. డిస్కౌంట్ ధరకే ఫ్లాగ్‌షిప్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. వివో గత ఏడాదిలో ఫ్లాగ్‌షిప్ వివో X100 ప్రో (Vivo X100 Pro) లాంచ్ చేసింది. ప్రస్తుతం
అమెజాన్‌లో రూ.31,500కుపైగా భారీ తగ్గింపు పొందగా ధర రూ.58,500కు లభిస్తోంది.

గత ఏడాదిలో ఈ వివో X100 ప్రో రూ.89,999 ప్రారంభ ధరకు మార్కెట్లో రిలీజ్ అయింది. పవర్‌‍ఫుల్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్, కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లే, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు భారీ బ్యాటరీని కలిగి ఉంది. మీరు ఫ్లాగ్‌షిప్ కెమెరా ఫోన్‌ కోసం ప్లాన్ చేస్తుంటే వివో X100 ప్రో అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

అమెజాన్‌లో వివో X100 ప్రో ధర :

ప్రస్తుతం వివో X100 ప్రో 5G ఫోన్ రూ.59,990కి అమ్ముడవుతోంది. లాంచ్ ధర రూ.89,999 నుంచి రూ.30,009 తగ్గింది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ.1,500 తగ్గింపు పొందవచ్చు. దాంతో ధర రూ.58,490కి తగ్గింపు పొందవచ్చు.

Read Also : Poco M7 Plus 5G : 7,000mAH బ్యాటరీతో కొత్త పోకో M7 ప్లస్ 5G వచ్చేసింది.. రివర్స్ ఛార్జింగ్ సపోర్టు అదుర్స్, ధర ఎంతంటే?

ఇంకా, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5శాతం డిస్కౌంట్, 1,649 వరకు 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు. మీ పాత ఫోన్ రూ. 31వేల వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ కూడా పొందవచ్చు. ఈ డీల్ 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో ఆస్టరాయిడ్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

వివో X100 ప్రో స్పెసిఫికేషన్లు :

వివో X100 ప్రో 5G ఫోన్ 6.78-అంగుళాల LTPO కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. హుడ్ కింద వివో ఫోన్ 16GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది. డైమెన్సిటీ 9300 చిప్‌సెట్‌ కలిగి ఉంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. వివో X100 ప్రో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో ZEISS-ట్యూన్ 50MP సోనీ IMX989 సెన్సార్, 50MP వైడ్-యాంగిల్ కెమెరా, OISతో 50MP టెలిఫోటో లెన్స్‌ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ OS 14పై రన్ అవుతుంది. అదనంగా, వివో X100 ప్రో 100W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్‌తో 5,400mAh బ్యాటరీతో వస్తుంది.