Poco M7 Plus 5G : 7,000mAH బ్యాటరీతో కొత్త పోకో M7 ప్లస్ 5G వచ్చేసింది.. రివర్స్ ఛార్జింగ్ సపోర్టు అదుర్స్, ధర ఎంతంటే?
Poco M7 Plus 5G : కొత్త పోకో M7 ప్లస్ 5G ఫోన్ వచ్చేసింది. 7,000mAH బ్యాటరీతో అద్భుతమైన కెమెరా ఫీచర్లతో అందుబాటులో ఉంది.

Poco M7 Plus 5G
Poco M7 Plus 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి పోకో M7 ప్లస్ 5G ఫోన్ వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ రివర్స్ ఛార్జింగ్ కెపాసిటీతో పాటు భారీ బ్యాటరీని (Poco M7 Plus 5G) అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 చిప్‌సెట్, డ్యూయల్ కెమెరా సెటప్‌ను కూడా అందిస్తుంది.
ఆండ్రాయిడ్ 15-ఆధారిత HyperOS 2.0పై రన్ అవుతుంది. అక్వా బ్లూ, కార్బన్ బ్లాక్, క్రోమ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 19 నుంచి ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. పోకో M7 ప్లస్ 5G ధర, స్పెసిఫికేషన్లు, ఆఫర్లకు సంబంధించి ఇతర వివరాలను చెక్ చేయండి.
భారత్‌లో పోకో M7 ప్లస్ 5G ధర, ఆఫర్లు :
పోకో M7 ప్లస్ 5G ఫోన్ 6GB, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999కు పొందవచ్చు. టాప్-ఎండ్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999కు పొందవచ్చు. HDFC, SBI, ICICI కార్డులపై ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. రూ.1,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.
పోకో M7 ప్లస్ 5G స్పెసిఫికేషన్లు :
పోకో M7 ప్లస్ 5G ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఫుల్ HD+ స్క్రీన్‌తో వస్తుంది. 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. లో-బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ, సిర్కాడియన్ కోసం TUV రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్లతో వస్తుంది. హుడ్ కింద పోకో ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 SoCతో వస్తుంది. 8GB వరకు ర్యామ్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత HyperOS 2.0పై రన్ అవుతుంది. 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.
కెమెరా విషయానికొస్తే.. ఈ పోకో 50MP ప్రైమరీ కెమెరా, సెకండరీ షూటర్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ పోకో ఫోన్ 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 5G, 4G, బ్లూటూత్ 5.1, Wi-Fi, GPS, USB టైప్-C పోర్ట్ కలిగి ఉంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌కు IP64 రేటింగ్ కూడా అందిస్తుంది.