Google Pixel 10 Series : గుడ్ న్యూస్.. ఇ-సిమ్ ఓన్లీ డిజైన్‌తో గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ వచ్చేస్తోంది.. ఇకపై ఫిజికల్ సిమ్ కార్డుతో పనిలేదు..!
Google Pixel 10 Series : గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఇ-సిమ్ ఓన్లీ డిజైన్ సపోర్టుతో వస్తోంది. మొత్తం 3 స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి..

Google Pixel 10 Series
Google Pixel 10 Series : గూగుల్ కొత్త పిక్సెల్ ఫోన్లను ఆగస్టు 20న ఆవిష్కరించనుంది. కొత్త లీక్ ప్రకారం.. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లలో పెద్ద మార్పు రాబోతోందని (Google Pixel 10 Series) తెలుస్తోంది. టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ ప్రకారం.. కంపెనీ పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL నుంచి ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్‌ను తొలగించవచ్చు.
ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్ లేదు:
ఈ 3 స్మార్ట్‌ఫోన్‌లు eSIM టెక్నాలజీతో వస్తాయని, రెండు యాక్టివ్ eSIM స్లాట్‌లను అందిస్తాయని భావిస్తున్నారు. అయితే, యునైటెడ్ స్టేట్స్‌కు మాత్రమే పరిమితం కావచ్చు. సిమ్ కార్డులను మార్చుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే.. ఈ ప్రక్రియ ఫిజికల్ కార్డుతో పోలిస్తే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఆసక్తికరంగా, గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్, ఫిజికల్ సిమ్ స్లాట్‌ను కలిగి ఉంటుందని సూచిస్తున్నారు.
ఆపిల్ ఇప్పటికే యూఎస్‌లో ఇసిమ్-ఓన్లీ ఐఫోన్ 14, ఐఫోన్ 15 మోడళ్లను అందిస్తోంది. ఈ మోడల్ ఐఫోన్లలో ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్ లేదు. నీళ్లలో తడిసినా సిమ్ ఎఫెక్ట్ కాదు. అలాగే, ఇతర పార్టులపై ఇంటర్నల్ స్టోరేజీ సమస్య ఉండదు. రాబోయే పిక్సెల్ అన్ని మోడళ్లకు CAD ఆధారిత రెండర్‌లు ప్రస్తుతం ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్‌ను సూచిస్తున్నాయి. కానీ, దీనిపై ఎలాంటి ధృవీకరణ లేదు.
లాంచ్ ఈవెంట్, పిక్సెల్ డివైజ్‌లు ఆలస్యం :
ఈ ఈవెంటులో గూగుల్ పిక్సెల్ 10 సిరీస్, పిక్సెల్ వాచ్ 4, పిక్సెల్ ఫోల్డ్ ప్రో 10, బడ్స్ 2a హెడ్‌ఫోన్‌లతో సహా అనేక కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించనుంది. అయితే, విన్‌ఫ్యూచర్ ఎంగాడ్జెట్ నివేదిక ప్రకారం.. ఈ ప్రొడక్టుల్లో కొన్ని కొనుగోలుకు అందుబాటులో ఉండకపోవచ్చు.