2025 Yezdi Roadster : బైక్ లవర్స్‌కు పండగే.. కొత్త యెజ్డి రోడ్‌స్టర్‌ బైక్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

2025 Yezdi Roadster : కొత్త యెజ్డి రోడ్‌స్టర్‌ బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధరలు రూ. 2.10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి అందుబాటులో ఉంటాయి.

2025 Yezdi Roadster : బైక్ లవర్స్‌కు పండగే.. కొత్త యెజ్డి రోడ్‌స్టర్‌ బైక్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

2025 Yezdi Roadster

Updated On : August 13, 2025 / 1:38 PM IST

2025 Yezdi Roadster : భారత మార్కెట్లోకి క్లాసిక్ లెజెండ్స్ కొత్త యెజ్డి రోడ్‌స్టర్‌ లాంచ్ చేసింది. ఈ బైక్ ధరలు రూ. 2.10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి (2025 Yezdi Roadster) అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త వెర్షన్ అద్భుతమైన డిజైన్, ఫీచర్, డివైజ్ అప్‌డేట్స్ అందిస్తుంది.

ఇటీవల యెజ్డి అడ్వెంచర్‌లో మాదిరి రిఫ్రెష్‌ను కలిగి ఉంది. అప్‌డేట్ మోడల్‌లో డిజైన్ మార్పులు, కొత్త కలర్ ఆప్షన్లు, పిలియన్ సీటు, వెడల్పు టైర్లు, కస్టమ్ కిట్‌లు ఉన్నాయి. అదే సమయంలో 334cc ఇంజిన్‌ కూడా కలిగి ఉంది. యెజ్డి బైక్ డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

2025 యెజ్డి రోడ్‌స్టర్ ధరలు, కలర్ ఆప్షన్లు :
రోడ్‌స్టర్ ఇప్పుడు రీడిజైన్ కౌల్, టియర్‌డ్రాప్ ఆకారపు ఇంధన ట్యాంక్, కర్వడ్ ఫెండర్‌లు, ఆకర్షణీయమైన టెయిల్‌లైట్‌ను కలిగి ఉంది. ఈ మోటార్‌సైకిల్ షార్క్‌స్కిన్ బ్లూ (రూ. 2,09,969), స్మోక్ గ్రే (రూ. 2,12,969), బ్లడ్‌రష్ మెరూన్ (రూ. 2,16,969), సావేజ్ గ్రీన్ (రూ. 2,21,969) అనే 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

2025 యెజ్డి రోడ్‌స్టర్ ఇంజిన్ స్పెసిఫికేషన్లు :
ఆల్ఫా 2తో 334cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ నుంచి పవర్ అందిస్తుంది. 29.6hp, 29.9Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Read Also : EPFO New Rules : ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఇకపై FAT లేకుండా UAN నెంబర్ క్రియేట్ చేయలేరు.. అసలు ఇదేంటి? ఫుల్ డిటెయిల్స్..!

2025 యెజ్డి రోడ్‌స్టర్ కస్టమైజేషన్ కిట్స్ :
యెజ్డి కస్టమైజేషన్ కిట్స్ కూడా కలిగి ఉంది. హైడ్రోఫార్మ్డ్ హ్యాండిల్ బార్, డిటాచబుల్ పిలియన్ సీటు, ఇంటిగ్రేటెడ్ టెయిల్-లైట్, టర్న్ ఇండికేటర్లు, డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌లు ఉన్నాయి. డిటాచబుల్ పిలియన్ సీటు ట్విన్, సింగిల్-సీట్ కాన్ఫిగరేషన్‌ల మధ్య క్విక్ ఎక్స్ఛేంజ్ అనుమతిస్తుంది. అయితే, మల్టీఫంక్షనల్ బ్లింకర్లు క్లీనర్ రియర్ ప్రొఫైల్ కోసం టెయిల్-లైట్‌ డబుల్ అవుతాయి.

2025 యెజ్డి రోడ్‌స్టర్ బ్రేక్‌లు, సస్పెన్షన్ :
మెకానికల్ అప్‌డేట్స్‌లో అప్‌గ్రేడ్ గ్రిప్, స్టెబిలిటీ కోసం వైడ్ 150-సెక్షన్ బ్యాక్ టైర్, మెరుగైన స్ప్లాష్ ప్రొటెక్షన్ కోసం వైడ్ బ్యాక్ ఫెండర్, స్పోర్టియర్ లుక్, సైడ్-ఆర్మ్ రియర్ హగ్గర్ ఉన్నాయి. బ్రేకింగ్ డ్యూటీ 320mm ఫ్రంట్ డిస్క్, 240mm రియర్ డిస్క్ కలిగి ఉంది.

అలాగే, డ్యూయల్-ఛానల్ ABSతో వస్తుంది. మోటార్ సైకిల్ ట్యూబ్‌లెస్ టైర్లతో అల్లాయ్ వీల్స్‌పై రన్ అవుతుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్‌లతో వస్తుంది.