Bharathi Ghattamaneni : హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న మహేశ్ బాబు అన్న కూతురు..?
దివంగత కృష్ణ మనవరాలు రమేష్ బాబు కూతురు భారతి ఘట్టమనేని (Bharathi Ghattamaneni ) హీరోయిన్‌గా ఓ మూవీలో కనిపించబోతోందట.

Mahesh babu brother daughter Bharathi Ghattamaneni making her debut as a heroine
Bharathi Ghattamaneni : టాలీవుడ్‌లో వారసుల ఎంట్రీ కొత్త కాదు. హీరోలు, దర్శకులు, నిర్మాతల కొడుకులు, కూతుర్లు సినీ అరంగ్రేటం చేయడం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ జోడీ టాలీవుడ్‌లో సందడి చేయనుందట. దివంగత కృష్ణ మనవరాలు రమేష్ బాబు కూతురు భారతి ఘట్టమనేని (Bharathi Ghattamaneni) హీరోయిన్‌గా ఓ మూవీలో కనిపించబోతోందట.
ఆ మూవీలో హీరో కూడా ఎవరో కాదు.. దర్శకుడు తేజ కుమారుడు. ఈ ఇద్దరూ ఓ సినిమాలో హీరో, హీరోయిన్‌గా తెరంగేట్రం చేయబోతున్నారని ఫిల్మ్ నగర్‌లో జోరుగా చర్చ నడుస్తోంది. భారతి ఇటీవల సోషల్ మీడియాలో కుర్చీ మడతపెట్టి పాటకు చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ కావడంతో, ఆమె లుక్, గ్రేస్ చూసి ఆమె హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్.
War 2 : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ ‘వార్ 2’ మూవీ రివ్యూ.. బాలీవుడ్ యాక్షన్ సినిమా..
ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతోందట. తేజ దర్శకత్వంలో ఆయన కుమారుడు బాలనటుడిగా కొన్ని సినిమాల్లో కనిపించినప్పటికీ, హీరోగా ఇదే తొలి ప్రయత్నం కానుంది.
ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది ఇంకా సస్పెన్స్‌గా ఉంది. కానీ డైరెక్టర్ తేజ స్వయంగా ఈ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించే అవకాశం ఉందని అంటున్నారు. ఘట్టమనేని కుటుంబం నుంచి మహేష్ బాబు సపోర్ట్ కూడా ఈ సినిమాకు ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని, యూత్‌ను ఆకట్టుకునే కథతో రాబోతున్నట్లు సమాచారం.
Balakrishna comments : అమరావతిలో కూడా బాలయ్య బాబు సేవలు.. అఖండ 2 పై కామెంట్స్.
ప్రస్తుతం భారతి, తేజ కుమారుడు ఇద్దరూ యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ జోడీ గురించి ఇప్పటినుంచే హైప్ మొదలైంది. భారతి డ్యాన్స్ స్కిల్స్, తేజ కుమారుడి లుక్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.