Diseases of Groundnut and Their Control Measures
Diseases Of Groundnut : వేరుశనగ పంటను ఆశించే తెగుళ్ళలో మొవ్వకుళ్ళు వైరస్ తెగులు కూడా ఒకటి. ఈ వైరస్ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తిచెందుతుంది. మొదట లేత ఆకులపై నిర్జీవ వలయాలు కనిపిస్తాయి. మొవ్వ ఎండిపోతుంది. లేత దశలో తెగులు ఆశించినట్లైతే మొక్కలు కురచబడి ఎక్కువ రెమ్మలు వస్తాయి.
ఆకులు చిన్నవిగా మారి లేత ఆకుపచ్చని మచ్చ కలిగి పాలిపోయి ఉంటాయి. లేత దశలో ఆశిచిన మొక్కలకు కాయలు ఏర్పడవు. ముదిరిన మొక్కలలో తెగులు లక్షణాలు కొన్ని కొమ్మలలో మాత్రమే కనిపిస్తాయి. వేరుశనగ కాయలు , విత్తనాలు చిన్నవిగా ఉండి ముడుచుకుని ఉంటాయి.
ఈ తెగులు నివారణకి తెగులును కొంతవరకు తట్టుకునే వేమన, ఐసిజిఎస్ 11, ఐసిజిఎస్ 44 వంటి రకాలను సాగు చేయాలి. కిలో విత్తనానికి 2 మి.లీ ఇమిడా క్లోప్రిడ్ తో విత్తనశుద్ధి చేసి తామర పురుగులు రాకుండా వైరస్ తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు.
తామర పురుగులను నివారించటానికి మోనో క్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా డైమిథోయేట్ 2మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తద్వారా తామర పురుగుల సంఖ్య తగ్గించి తెగులు వ్యాప్తిని అరికట్టుకోవచ్చు.