Paddy Cultivation : వరిలో కాండంతోలుచు పురుగు నివారణ
ల్లో నీటి వసతి ఉన్నచోట రైతులు వరి సాగు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికీ నాట్లు వేస్తుండగా, మరికొన్ని చోట్ల పిలక దుబ్బు దశలో ఉంది. వరి పైరులో కాండం తొలుచు పురుగు నారుమడిదశనుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశిస్తుంది.
- Guntupalli Ramakrishna
- Published On : September 14, 2023 / 12:00 PM IST
Paddy Cultivation
Paddy Cultivation : ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. వరినాట్లు కూడా ఆలస్యంగానే వేశారు రైతులు. కొన్ని చోట్ల ఇంకా ముదురు నారును వేస్తున్నారు. గత యాసంగి లాగే ఈ సారి కూడా వరిపంటకు కాండంతోలుచుపురుగుల బెడద ఎక్కువైంది. వీటిని సకాలంలో అరికట్టకపోతే తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదముందని సమగ్ర సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు
READ ALSO : Mushroom Cultivation : పుట్టగొడుగుల పెంపకంలో ఆసక్తిగల యువకులకు శిక్షణ ఇస్తున్న ఉండి కేవికే
తెలుగు రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్నచోట రైతులు వరి సాగు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికీ నాట్లు వేస్తుండగా, మరికొన్ని చోట్ల పిలక దుబ్బు దశలో ఉంది. వరి పైరులో కాండం తొలుచు పురుగు నారుమడిదశనుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశిస్తుంది.
READ ALSO : Paddy Harvesting : నారు, నాట్లు అవసరం లేకుండా వరిసాగు
ఈ పురుగును సకాలంలో నివారించకపోతే 20-30 శాతం దిగుబడులను రైతులు నష్టపోవాల్సి వస్తుందంటూ దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా , బెల్లంపల్లి, కృషి విజ్ఞాన కేంద్రం.
