Paddy Harvesting : నారు, నాట్లు అవసరం లేకుండా వరిసాగు

ఇటీవలి కాలంలో వరిసాగులో ఖర్చులు పెరగడం, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్దతిపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ పద్దతిలో ఎకరానికి 15 నుండి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది.

Paddy Harvesting : నారు, నాట్లు అవసరం లేకుండా వరిసాగు

Paddy Harvesting

Paddy Harvesting : అధిక నీరు అవసరమయ్యే పంట కావడంతో వరి సాగుకు వాతావరణ మార్పులు శాపంగా మారుతున్నాయి. దీనికి తోడు కూలీల కొరత అధికంగా ఉండటంతో చాలా మంది రైతులు దమ్ము చేసిన మాగాణుల్లో డ్రమ్ సీడర్ పరికరంతో విత్తనాన్ని నేరుగా విత్తి, అదునులోనే పంట సాగుచేస్తున్నారు. దీంతో ఎకరాకు రూ. 5 వేల వరకు ఖర్చు తగ్గడమే కాకుండా, నారు, నాట్లతో పనిలేకుండా, తక్కువ శ్రమతో మంచి ఫలితాలు చేతికందుతున్నాయి. అయితే ఈ విధానంలో కొన్ని మెళకువలు పాటిస్తే మంచి దిగుబడులను పొందవచ్చిన సూచిస్తున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి.

READ ALSO : Rice Cultivation : పొడి విధానంలో వరి సాగు.. తక్కువ పెట్టుబడితోనే పంట దిగుబడులు

ఇటీవలి కాలంలో వరిసాగులో ఖర్చులు పెరగడం, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్దతిపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ పద్దతిలో ఎకరానికి 15 నుండి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. పంట కూడా 7 నుండి 10 రోజుల ముందుగానే కోతకు వస్తుంది. నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు.

READ ALSO : Paddy Crop Cultivation : నెల్లూరు జిల్లాలో ఎడగారు వరి సాగు.. చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

కాబట్టి సాగు ఖర్చులు ఎకరానికి రూ. 2500 నుండి 3 వేల వరకు తగ్గుతుంది. మొక్కల సాంధ్రత సరిపడా ఉండటం వలన దిగుబడి 10 నుండి 15 శాతం వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకొని కూలీల కొరతను అధిగమించవచ్చు. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరిసాగు చేసుకునే అవకాశం ఉంది.

READ ALSO : Seed Production In Soybean : సోయా చిక్కుడులో విత్తనోత్పత్తి విధానంపై రైతులకు అవగాహన అవసరమే!

అందువలన తెలంగాణలోని కొన్ని జిల్లాలో డ్రమ్ సీడర్ విధానం బాగా ప్రాచుర్యం పొందింది. అయితే  డ్రమ్ సీడర్ విధానంలో సాగుచేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు… నాగర్ కర్నూలు జిల్లా, పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి.

READ ALSO : Ladies Finger Planting : వేసవి పంటగా 2 ఎకరాల్లో బెండ సాగు.. 3 నెలలకే రూ. 2 లక్షల నికర ఆదాయం

డ్రమ్ సీడర్ విధానంలో సాగుచేసేటప్పుడు.. సాధారణ పద్దతిలో వరినాటేటప్పుడు కంటే భూమినంత బాగా చదును చేసుకోవాలి. ఎత్తుపల్లాలు లేకుండా సమాంతరంగా ఉండటం చాలా అవసరం. విత్తిన తరువాత వచ్చే కలుపును సమయానుకూలంగా సస్యరక్షణ చర్యలతో నివారించాలి. అంతే కాదు సాధారణ పద్ధతిలాగేనే ఎరువుల యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉంటుంది.