Paddy Crop Cultivation : నెల్లూరు జిల్లాలో ఎడగారు వరి సాగు.. చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

ఈ ఏడాది వరి విస్తీర్ణం నామమాత్రంగా వుంది. ఎడగారు వరిలో ఎక్కువగా 120 రోజుల్లో పంట చేతికొచ్చే స్వల్పకాలిక వరి రకాలను సాగుచేస్తున్నారు. ప్రస్థుతం పైరు 30 నుండి 40 రోజుల దశలో వుంది. ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి నెల్లూరు ప్రాంతీయ వరి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. యు. వీనీత తెలియజేస్తున్నారు.

Paddy Crop Cultivation : నెల్లూరు జిల్లాలో ఎడగారు వరి సాగు.. చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

Paddy Crop Cultivation

Paddy Crop Cultivation : ఖరీఫ్ ప్రారంభమైంది. రైతులు కూడా పంటలు విత్తేందుకు సిద్దమవుతున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం వరిపైరు నెల నుండి 2 నెలల దశలో ఉంది. దీన్నే ఎడగారు లేదా కత్తెర వరి అంటారు. తొలకరి ప్రారంభమైన ఇంకా ఎండల తీవ్రత తగ్గలేదు. ఈ నేపధ్యంలో ఎడగారు వరిలో ప్రస్థుతం చేపట్టాల్సిన జాగ్రత్తలు, సాగకు నోచుకోని భూముల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు గురించి తెలియజేస్తున్నారు నెల్లూరు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. వినీత.

READ ALSO : Benda Cultivation : ప్రకృతి విధానంలో బెండ సాగు.. ఎకరాకు 2 లక్షల నిరకర ఆదాయం

సాధారణంగా ఖరీఫ్ వరి సీజన్ అనేది జూన్ జూలై మాసాల్లో మొదలవుతుంది. కానీ నెల్లూరు జిల్లాలోని ప్రత్యేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎర్లీ ఖరీఫ్ గా ఏప్రెల్, మే నెలల్లో ఎడగారు వరి సాగుచేస్తారు. డెల్టా ప్రాంతంలో బోర్లు బావులు ఆధారంగాను, నీటి వసతి కింద రైతులు ముందుస్తుగా వరి సాగుచేయటం ఆనవాయితీగా వస్తోంది. అయితే సాధారణ వరి విస్తీర్ణం లక్షా 10వేల ఎకరాలు కాగా, 70 శాతం లోటు వర్షపాతం వల్ల,  40వేల ఎకరాల్లో కూడా వరి సాగవలేదు.

READ ALSO : Paddy : వరిసాగులో అగ్గి తెగులు నివారణ!

ఈ ఏడాది వరి విస్తీర్ణం నామమాత్రంగా వుంది. ఎడగారు వరిలో ఎక్కువగా 120 రోజుల్లో పంట చేతికొచ్చే స్వల్పకాలిక వరి రకాలను సాగుచేస్తున్నారు. ప్రస్థుతం పైరు 30 నుండి 40 రోజుల దశలో వుంది. ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి నెల్లూరు ప్రాంతీయ వరి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. యు. వీనీత తెలియజేస్తున్నారు.

READ ALSO : Paddy Cultivation : వరిసాగులో కాలానుగుణంగా మార్పులు.. నూతన వరి వంగడాలను రూపొందిస్తున్న శాస్త్రవేత్తలు

ఎడగారు వరి సాగుచేయని రైతాంగం ప్రస్థుతం కురిసిన వర్షాలతో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకోవచ్చు. స్వల్పకాలంలో చేతికొచ్చే పప్పుధాన్యాల సాగుకు ప్రస్థుత పరిస్థితులు అనుకూలమంటూ తెలియజేస్తున్నారు డా. వినీత.