Munaga Nursery : మునగ నర్సరీతో లాభాల బాట.. ఒక సారి నాటితే 3 సంవత్సరాల పాటు దిగుబడి

మునగ చెట్టులో ప్రతీ భాగం ఉపయోగకరమైనదే. వీటి ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి విత్తనాలను ఔషధ పరిశ్రమలలో వాడతారు. అందుకే, వీటికి మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంటుంది. ఆరోగ్యపరంగానే కాకుండా, వ్యాపారపరంగానూ మునగను సాగు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది.

Munaga Nursery

Munaga Nursery : తెలుగు రాష్ట్రాల్లో సాగుచేయబడుతున్న కూరగాయ పంటల్లో మునగా ఒకటి. ఒక సారి నాటితే 2 నుండి 3 సంవత్సరాల పాటు దిగుబడినిస్తుంది. మార్కెట్ రేటులో ఒడిదుడులకులు ఉన్నప్పటికీ.. ఎకరానికి 2 నుండి 4 లక్షల ఆదాయం పొందవచ్చు. అందుకే చాలా మంది రైతులు మునగ సాగుకు మొగ్గుచూపుతున్నారు. ఇందుకు అనుగుణంగానే కొంత మంది రైతులు నర్సరీలను ఏర్పాటుచేసి ఉపాధి పొందుతున్నారు.

READ ALSO : Integrated Farming : ప్రణాళిక బద్ధంగా సమీకృత వ్యవసాయం.. కొబ్బరితో పాటు చేపలు , కోళ్లు పెంపకం

పోషకాల గనిగా పేరు తెచ్చుకున్న మునగ.. రైతుల పాలిట కల్పవృక్షంగా విరాజిల్లుతున్నది. తిన్నవారికి ఆరోగ్యం, పండించిన వారికి లాభాలు అందిస్తున్నది. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులు అందిస్తూ.. అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్నది. అంతే కాదు.. మునగ నర్సరీ పెట్టుకున్న రైతులకు కూడా మంచి లాభాలను ఇస్తోంది.

READ ALSO : Paddy Varieties : ఖరీఫ్ కు అనువైన వరంగల్ వరి రకాలు

మునగ చెట్టులో ప్రతీ భాగం ఉపయోగకరమైనదే. వీటి ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి విత్తనాలను ఔషధ పరిశ్రమలలో వాడతారు. అందుకే, వీటికి మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంటుంది. ఆరోగ్యపరంగానే కాకుండా, వ్యాపారపరంగానూ మునగను సాగు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. అందుకే కొంత మంది మునగ నర్సరీ పెట్టుకొని లాభాలు పొందుతున్నారు.

READ ALSO : Groundnut Cultivation : వేరుశనగ సాగులో యాజమాన్యం.. అధిక దిగుబడుల కోసం శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు

ఈ కోవలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా, జి.కె.వీది మండలం, రింతాడ పంచాయతీకి చెందిన రైతు కృష్ణమూర్తి మునగ నర్సరీ ఏర్పాటు చేసి జిల్లాలోని పలు మండలాల రైతులకు మొక్కలను సరఫరా చేస్తున్నారు. అంతే కాదు భైబ్యాక్ ఒప్పందంపై నేరుగా రైతుల వద్దనుండి పంట దిగుబడులను కొనుగోలు చేస్తున్నారు.

READ ALSO : స్మార్ట్ సేద్యం.. యాప్ సాయంతో పంటలు… నూజివీడు త్రిపుల్ ఐటీ విద్యార్థుల ఘనత

మార్కెట్ లేని సమయంలో కాయలు ఎండిపోయినా… వాటిని కూడా కొనుగోలు చేస్తున్నారు. 3సంవత్సరాల తరువాత పంట తీసేవేసే రైతుల వద్ద నుండి మొక్క నుండి వచ్చే దుంపలను కూడా కొనుగోలు చేస్తుండటంతో… రైతులు మునగసాగుకు మొగ్గుచూపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు