Soil sampling
Soil Testing : లాభదాయకమైన పంటల ఉత్పాదకత కోసం భూసార పరీక్ష ఓ మంచి సాధనం. భూసార పరీక్షల వల్ల రైతులు నేల ఆరోగ్యం, పోషకాల లభ్యత తెలుసుకొని దానికి అనుగుణంగా స్థూల, సూక్ష్మ పోషకాలను పంటలకు అందించి మంచి దిగుబడి సాధించొచ్చు.
READ ALSO : Summer Cultivable Vegetables : వేసవిలో సాగుచేయాల్సిన కూరగాయ పంటలు.. అధిక దిగబడికోసం శాస్త్రవేత్తల సూచనలు
అయితే చాలా వరకు రైతులకు భూసార పరీక్షలు, మట్టి సేకరణ పట్ల అంతగా అవగాహన లేదు. మట్టినమూన ఏవిధంగా సేకరించాలి, ఎక్కడ పరీక్షలు చేయించాలో తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డా. రాజేశ్వర్ నాయక్.
సాగు విషయంలో రైతులు విక్షణా రహితంగా వ్యవహరించొద్దు. తమ వ్యవసాయ భూమికి ఎలాంటి ఎరువులు వాడాలో తెలుసుకుని అందుకు అణుగుణంగా ముందుకు సాగాలి. భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. ఎక్కువ దిగుబడి వచ్చి లాభాలు గడించొచ్చు.
READ ALSO : Health Benefits Of Jamun : డయాబెటిస్‌ఉన్నవారు నేరేడు పండ్లు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు !
అడ్డగోలుగా ఎరువులు వాడటం వల్ల భూమి నిస్సారమవుతుంది. భవిష్యత్‌లో పంటలకు పనికిరాకుండా పోతుంది. భూమిలో ఏయే పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకునేందుకు భూసార పరీక్షలు అవసరం. భూసార పరీక్షల ఆధారంగా సాగు చేయాలి. సాగు భూమి నుంచి తీసిన మట్టి నమూనా సేకరణకు ప్రస్తుతం అనువైన సమయం .
పొలంలో ఏ పంటలూ లేని వేసవికాలంలో, భూసార పరీక్షలు చేయించటానికి అనువైన సమయం. నేల స్థితిగతులను తెలుసుకుని, అవసరం మేర ఎరువులను వాడుకోవటం వల్ల ఎరువులపై పెట్టె ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు.
READ ALSO : Cocoa Cultivation : కొబ్బరిలో అంతర పంటగా కోకో సాగు.. ఏడాదికి రూ. 10 లక్షల ఆదాయం
పరీక్షల ఆధారంగా సూక్ష్మపోషకాలందిస్తే అధిక దిగుబడులను పొందవచ్చు. అంతే కాకుండా ఖరీఫ్ కు సిద్ధమయ్యేందుకు రైతాంగం ఇప్పుడే అన్ని సిద్ధం చేసుకుంటే తొలకరి నాటికి సునాయాసంగా విత్తనాలను విత్తుకోవచ్చు. అయితే భూసార పరీక్షల కోసం మట్టిని ఏ విధంగా సేకరించాలో రైతులకు తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డా. రాజేశ్వర్ నాయక్.