Summer Cultivable Vegetables : వేసవిలో సాగుచేయాల్సిన కూరగాయ పంటలు.. అధిక దిగబడికోసం శాస్త్రవేత్తల సూచనలు

వేసవిలో కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున, రైతులు తమకు లభించే పరిమితి వనరులతో సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టి కూరగాయలు పండించినట్లయితే రైతులు మంచి దిగుబడులను పొందవచ్చు.

Summer Cultivable Vegetables : వేసవిలో సాగుచేయాల్సిన కూరగాయ పంటలు.. అధిక దిగబడికోసం శాస్త్రవేత్తల సూచనలు

Summer Cultivable Vegetables

Summer Cultivable Vegetables : వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో వుండే తక్కువ తేమ కూరగాయలసాగుకు ప్రతిబంధకమవుతుంది. వీటిని అధిగమించి.. రైతులు, వేసవిలో కూరగాయలను సాగుచేసి, లాభాలు పొందాలంటే, వేసవికి అనువైన రకాలను ఎన్నుకోవాలి. అంతే కాదు వడగాల్పుల వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి, పూత, పిందె తగ్గి తద్వారా దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. రైతులు సమగ్ర యాజమాన్య పద్దతులను చేపట్టినట్లైతే కూరగాయల పంటల్లో అధిక దిగుబడులను సాధించవచ్చని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త చైతన్యం.

READ ALSO : Vegetable Farming : 2 ఎకరాల్లో కూరగాయల సాగు.. ఏడాదికి రూ. 4 లక్షల నికర ఆదాయం

మన ఆహారంలో కూరగాయలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. నిత్యం కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవడం.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున, రైతులు తమకు లభించే పరిమితి వనరులతో సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టి కూరగాయలు పండించినట్లయితే రైతులు మంచి దిగుబడులను పొందవచ్చు. కానీ వేసవిలో వీచే పొడి గాలులు, క్రమంగా పెరిగే ఉష్ణోగ్రతలు, తగ్గిపోయే నీటి వనరులు ఇలా అనేక కారణాలు కూరగాయల సాగుకు ప్రతికూలంగా ఉంటాయి. అయితే వేడిని తట్టుకునే రకాల ఎంపికతోపాటు , మేలైన యాజమాన్య పద్ధతులు పాటించటం వలన ఆశించిన ఫలితాలను పొందవచ్చని ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త చైతన్యం తెలియజేస్తున్నారు

READ ALSO : Cultivation of vegetables : ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగు.. ఏడాది పొడవునా దిగుబడులు

కూరగాయలలో సుమారు 80 నుండి 95 శాతం వరకు నీరు ఉంటుంది. కావున కూరగాయల సాగులో నీటి ఎద్దడి ఏర్పడితే దిగుబడితో పాటు నాణ్యత కూడా గణనీయంగా తగ్గిపోతుంది. అంతే కాదు ఈ కాలంలో మొక్కల ఎదుగుదల అంతగా ఉండదు. కాబట్టి క్రమ పద్ధతిలో ఎరువుల్ని అందించాలి. ఇటు వివిధ రకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. వాటి నివారణకు సిఫార్సు చేసిన మోతాదులోనే రసాయన మందులను పిచికారి చేయాలి.