Cocoa Cultivation : కొబ్బరిలో అంతర పంటగా కోకో సాగు.. ఏడాదికి రూ. 10 లక్షల ఆదాయం

పదికాలాలపాటు పెరిగే కొబ్బరి తోటకు కోకోసాగు ఊతంగా నిలుస్తోంది. కోకో చెట్లకు ఆకును విపరీతంగా రాల్చే గుణం వుండటం వల్ల ఇది కుళ్లి సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడుతోంది.

Cocoa Cultivation : కొబ్బరిలో అంతర పంటగా కోకో సాగు.. ఏడాదికి రూ. 10 లక్షల ఆదాయం

Cocoa Cultivation

Updated On : June 11, 2023 / 8:22 AM IST

Cocoa Cultivation : అంతర పంటల సాగుకు  కొబ్బరితోటలను  రైతులపాలిట కల్పతరువుగా చెప్పుకోవచ్చు.  కానీ చాలామంది రైతులు అంతర పంటలసాగు పట్ల అవగాహన లేకపోవటంతో ఎంతో ఆదాయాన్ని కోల్పోతున్నారు. పాక్షిక నీడనిచ్చే కొబ్బరి వాతావరణంలో ఎన్నో రకాల వాణిజ్య పంటలను సాగుచేసుకోవచ్చు.

READ ALSO : Intercropping In Coconut : కొబ్బరిలో దోస, సొర, మినుము పంటల సాగు.. అంతర పంటలతో అదనపు ఆదాయం

దీన్నే ఆచరణలో పెట్టి మంచి దిగుబడులను పొందుతున్నారు అంబేద్కర్ కోనసీమా జిల్లాకు చెందిన ఓ రైతు. కొబ్బరిలో అంతర పంటగా కోకోను సాగుచేస్తూ అదనపు లాభాలను ఆర్జిస్తున్నారు. మరి ఆ రైతు అనుభవాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాజిల్లాలు కొబ్బరిసాగుకు పెట్టింది పేరు. అధిక వర్షపాతం, గాలిలో తేమశాతం అధికంగా వుండటంతో కొబ్బరిసాగుకు అత్యంత అనువుగా వుంది. అయితే సాగు పెట్టుబడి పెరగటం, ఆదాయం నామమాత్రంగా వుండటంతో,  ఏకపంటగా కొబ్బరిసాగు రైతుకు గిట్టుబాటు కావటం లేదు.

READ ALSO : Sustainable Agriculture : పామాయిల్, కొబ్బరి, డెయిరీ తో సుస్థిర వ్యవసాయం

ఈ నేపధ్యంలో ఉద్యాన తోటల సాగును కొత్తపుంతలు తొక్కిస్తున్నారు  అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం , అవిడి గ్రామానికి చెందిన రైతు గాదిరాజు మురళీకృష్ణా . తనకున్న 10 ఎకరాల వ్యవసాయ భూమిలో 40 ఏళ్ల క్రితం కొబ్బరి మొక్కలు నాటారు. అయితే ఒకే పంటపై వచ్చే ఆదాయం సరిపోకపోవడం… మొక్కల మద్య ఖాలీ స్థలం అధికంగా ఉండటంతో 12 ఏళ్ల క్రితం కోకోను నాటారు. దీంతో రెండు పంటల నుండి ఆదాయం పొందుతున్నారు.

పదికాలాలపాటు పెరిగే కొబ్బరి తోటకు కోకోసాగు ఊతంగా నిలుస్తోంది. కోకో చెట్లకు ఆకును విపరీతంగా రాల్చే గుణం వుండటం వల్ల ఇది కుళ్లి సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడుతోంది. తోటల్లో కలుపు బెడద తగ్గటంతోపాటు, భూసారం పెరిగిందని రైతు చెబుతున్నారు.

READ ALSO : Sameekrutha Vyavasayam : కొబ్బరితో పాటు చేపలు , కోళ్లు పెంచుతున్న ఏలూరు జిల్లా రైతు

సాగు భూమి తగ్గిపోతుండటం, చిన్న కమతాలు పెరిగిపోవటం వంటి కారణాలతో వ్యవసాయంలో నేడు రైతు మనుగడ ప్రశ్నార్ధకమవుతున్నపరిస్థితుల్లో… ప్రతీ రైతు ఆదాయం పెంచుకునే దిశగా… ఆధునిక పరిజ్ఞానంతో, ప్రణాళికాబద్దంగా ముందడుగు వేయాల్సిన అవసరం వుంది. దీర్ఘకాలిక పంటలను వేస్తున్నా, అందులో కూడా అంతర పంటలను వేసి , ఏమాత్రం భూమిని, సమయాన్ని వృథా చేయకుండా రాబడి పొందుతున్నా రైతు మురళీకృష్ణా, సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు .