Sustainable Agriculture : పామాయిల్, కొబ్బరి, డెయిరీ తో సుస్థిర వ్యవసాయం

మొత్తం 40 ఎకరాల విస్తీర్ణం. ఇందులో20 ఎకరాల్లో కొబ్బరి, 15 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు, మరో 5 ఎకరాల్లో ఆయిల్ పామల్ లో అంతర పంటగా అరటి సాగులో ఉన్నాయి. వీటితో పాటు అనుబంధంగా డెయిరీని నిర్వహిస్తున్నారు.

Sustainable Agriculture : పామాయిల్, కొబ్బరి, డెయిరీ తో సుస్థిర వ్యవసాయం

Sustainable Agriculture

Sustainable Agriculture : సుస్థిర వ్యవసాయానికి నిలువెత్తు నిదర్శనం ఆ క్షేత్రం. 40 ఎకరాల సువిశాల ఆయిల్ పామ్, కొబ్బరి, అరటి తోటల్లో ఏడాదిగా ఎలాంటి రసాయన ఎరువుల మాట లేదు. పురుగు మందులకు తావులేదు. కేవలం కూలీలకు తప్పా, ఇతర సాగు ఖర్చులు లేవు. పెట్టుబడులు పెరిగిపోయి, వ్యవసాయమంటే జూదంలా మారిపోతున్న తరుణంలో గో ఆధారిత వ్యవసాయం చేస్తూ… ఆయిల్ పామ్, కొబ్బరి తోటల్లో నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. అంతే కాదు అంతర పంటలు, డెయిరీ నిర్వాహణతో అదనపు ఆదాయం పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన రైతు నందిగం సీతారామ తిలక్. ఏలూరు జిల్లా, లింగపాలెం మండలం, కలరాయి గూడెం గ్రామానికి చెందిన ఈయన, గతంలో రసాయన ఎరువులతో సాగుచేసేవారు. అయితే పెట్టుబడులు పెరిగి, దిగుబడులు రాకపోవడంతో ఏడాది నుండి ప్రకృతి విధానంలో గోఆధారిత వ్యవసాయం చేస్తున్నారు.

READ ALSO : Banana Plantation : అరటిసాగులో ఎరువుల యాజమాన్యం.. అధిక దిగుబడులకు శాస్త్రవేత్తల సూచనలు

మొత్తం 40 ఎకరాల విస్తీర్ణం. ఇందులో20 ఎకరాల్లో కొబ్బరి, 15 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు, మరో 5 ఎకరాల్లో ఆయిల్ పామల్ లో అంతర పంటగా అరటి సాగులో ఉన్నాయి. వీటితో పాటు అనుబంధంగా డెయిరీని నిర్వహిస్తున్నారు. దశాబ్దకాలంగా వ్యవసాయరంగంలో అనేక మార్పులు వచ్చాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాలు మాయలో రసాయన ఎరువుల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోవటం, సేద్యాన్ని పతనావస్థకు చేర్చింది. భూములు నిస్సారమవటం. చీడపీడల ఉధృతి పెరగటం వల్ల, దిగుబడులు తగ్గుతూ వచ్చాయి. ఓవైపు పెరుగిన పెట్టుబడి, మరోవైపు కూలీల కొరత భారం రైతును వెన్నాడుతోంది. దీంతో పెట్టుబడి మాట దేవుడెరుగు నష్టాలు అనేమాట రైతు నోట పరిపాటిగా మారింది.

READ ALSO : Water Management Methods : కొబ్బరి సాగులో నీటియాజమాన్య పద్దతులు!

ఈ పరిస్థితులను అనుభవం ద్వారా తెలుసుకున్న రైతు నందిగం సీతారామ తిలక్ తనకున్న 40 ఎకరాల కొబ్బరి, ఆయిల్ పామ్ తోటలతో పాటు అరటి పంటలను ఏడాదిగా ప్రకృతి విదానంలో సాగు చేస్తున్నారు. అంతే కాదు 30 గేదెలు, ఆవులతో కలిపి డెయిరీని నిర్వహిస్తున్నారు. డెయిరీ నుండి వచ్చిన వ్యర్థాలను మొక్కలకు అందిస్తూ.. ఎలాంటి పెట్టుబడి లేకుండా.. నాణ్యమైన దిగుబడులను పొందుతున్నారు.

READ ALSO : Intercrop Cultivation : పామాయిల్ లో అంతర పంటగా చెరకు సాగు

మిశ్రమ వ్యవసాయంలో భాగంగా రైతు తిలక్ డేయిరీని నిర్వహిస్తున్నారు. 15 గేదెలు, 15 ఒంగోలు ఆవులను తోటలోనే షెడ్ వేసి పెంచుతున్నారు. పగలంతా ఆవులు తోటలో పెరిగిన గడ్డిని తింటాయి. సాయంత్రానికి షెడ్డులోకి చేరతాయి. దీనివల్ల గడ్డి కొనుగోలు ఖర్చు కొంత వరకు తగ్గిస్తున్నారు. పైగా పాడిపరిశ్రమనుండి వచ్చిన ఎరువు, మూత్రాన్ని మొక్కలకు అందిస్తున్నాడు.