Dharma Mahesh : భార్యతో వివాదం.. బిజినెస్ మొత్తం కొడుకు పేరు మీదకు.. మరో కొత్త రెస్టారెంట్ ప్రారంభించిన హీరో..

ఈ వివాదం కొన్ని రోజుల క్రితం వైరల్ గా మారింది. అప్పట్నుంచి ధర్మ ఎక్కువగా సోషల్ మీడియాలో, బయట కనపడలేదు. (Dharma Mahesh)

Dharma Mahesh : భార్యతో వివాదం.. బిజినెస్ మొత్తం కొడుకు పేరు మీదకు.. మరో కొత్త రెస్టారెంట్ ప్రారంభించిన హీరో..

Dharma Mahesh

Updated On : November 23, 2025 / 5:32 PM IST

Dharma Mahesh : సింధూరం, డ్రింకర్ సాయి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కాకాని ధర్మ సత్య సాయి శ్రీనివాస మహేశ్ అలియాస్ ధర్మ మహేష్. అయితే ఇటీవల ధర్మ భార్య ఇతనిపై పోలీస్ కేసు పెట్టింది. సోషల్ మీడియాలో పరిచయం అయి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు ఈ జంట. వీరికి జగద్వజ అనే కొడుకు కూడా ఉన్నాడు.(Dharma Mahesh)

ఇటీవల భార్య – భర్తల మధ్య నెలకొన్న పలు వివాదాల నేపథ్యంలో ధర్మ మీద గౌతమి.. గౌతమి మీద ధర్మ కేసులు పెట్టుకున్నారు. ఈ వివాదం కొన్ని రోజుల క్రితం వైరల్ గా మారింది.

Also Read : Jabardasth Naresh : నా హైట్ వల్ల మా అమ్మ చాలా బాధపడింది.. నన్ను ఏడిపించేవాళ్ళు.. నరేష్ ఎమోషనల్..

అప్పట్నుంచి ధర్మ ఎక్కువగా సోషల్ మీడియాలో, బయట కనపడలేదు. అయితే తాజాగా ధర్మ మహేష్ మరో కొత్త రెస్టారెంట్ ని ప్రారంభించాడు. ధర్మ మహేష్ కి జిస్మత్ మండి రెస్టారెంట్స్ ఉన్నాయి. గౌతమి వీటి మీద కూడా పలు ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో ‘Gismat’ నుంచి ‘Jismat’కు పేరు మారుస్తూ అమీర్‌పేట్‌లో మరో కొత్త రెస్టారెంట్ ని ప్రారంభించాడు ధర్మ మహేష్.

ఈ క్రమంలో ధర్మ మాట్లాడుతూ.. నా కొడుకు జగద్వాజ పుట్టినరోజు సందర్భంగా ‘జిస్మత్ జైల్ మందీ’ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నాను. భోజన ప్రియులకు జిస్మత్ ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. ‘Gismat’ నుంచి ‘Jismat’కు బ్రాండ్‌ను మార్చడం వెనుక నాణ్యత, భావోద్వేగం, వారసత్వం కూడా ఉంది. కంపెనీ యాజమాన్యాన్ని పూర్తిగా నా కుమారుడు జగద్వజకు అంకితం చేస్తున్నాను. నా కొడుకు కోసం బిజినెస్ మొత్తం జగద్వజ పేరు మీదకు మారుస్తున్నాను అని తెలిపారు.

Also Read : Tollywood Hero : నాకు పేరు పెట్టింది ఆయనే.. సత్యసాయితో చిన్నప్పటి ఫోటో షేర్ చేసిన స్టార్ హీరో.. ఎవరో కనిపెట్టండి..

భార్యతో వివాదం నేపథ్యంలో కొత్త రెస్టారెంట్ ఏర్పాటు చేయడం, బిజినెస్ అంతా తన కొడుకు పేరు మీదకు మార్చడంతో ఈ విషయం వైరల్ గా మారింది. మరి దీనిపై గౌతమి స్పందిస్తుందా చూడాలి.

Dharma Mahesh Started New Restaurant after Issues with Wife and Change Business to his Son name