Jabardasth Naresh : నా హైట్ వల్ల మా అమ్మ చాలా బాధపడింది.. నన్ను ఏడిపించేవాళ్ళు.. నరేష్ ఎమోషనల్..

గతంలో తను హైట్ తక్కువ ఉండటం వల్ల చాలా మంది ఏడిపించారంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నరేష్. (Jabardasth Naresh)

Jabardasth Naresh : నా హైట్ వల్ల మా అమ్మ చాలా బాధపడింది.. నన్ను ఏడిపించేవాళ్ళు.. నరేష్ ఎమోషనల్..

Jabardasth Naresh

Updated On : November 23, 2025 / 4:36 PM IST

Jabardasth Naresh : జబర్దస్త్ షోతో కమెడియన్ గా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు నరేష్. తన తక్కువ హైట్ నే సపోర్ట్ గా మార్చుకొని కమెడియన్ అయ్యాడు. ఇప్పుడు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో పాటు పలు టీవీ ఈవెంట్స్, బయట ఈవెంట్స్, అడదపాదడపా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు నరేష్. అయితే గతంలో తను హైట్ తక్కువ ఉండటం వల్ల చాలా మంది ఏడిపించారంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నరేష్.

Also Read : Jabardasth Naresh : మాది చెత్త బిజినెస్.. నరేష్ కష్టాలు.. అసలు ఏం చదువుకున్నాడు, జబర్దస్త్ కి ఎలా వచ్చాడో తెలుసా?

నరేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో నా హైట్ చూసి నన్ను హర్ట్ చేసారు చాలా మంది. పొట్టి అని ఇంకా చాలా పేర్లతో పిలిచేవాళ్లు, బాగా బాధపడేవాడ్ని. మా అమ్మ చాలా బాధపడేది. నా హైట్ చూసి మా అమ్మ నా లైఫ్ ఏమవుతుందో అని బాధపడింది. కానీ ఏ హైట్ అయితే నన్ను ఒకప్పుడు బాధపెట్టిందో ఇప్పుడు అదే హైట్ ప్లస్ అయింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాకు ఇలా ఉంటేనే బెటర్ అనిపించింది అని తెలిపాడు.

 

Also Read : Jabardasth Naresh : ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదు.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నరేష్..