Flipkart Black Friday Sale : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. ఈ టాప్ 5 స్మార్ట్‌ఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. ఏది కొంటారో మీఇష్టం..!
Flipkart Black Friday Sale : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో టాప్ 5 స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ అదిరిపోయే ఆఫర్లపై ఓసారి లుక్కేయండి.
Flipkart Black Friday Sale
Flipkart Black Friday Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్ సమయంలో సరసమైన ధరలో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్లను కొనేసుకోవచ్చు.
ఇందులో శాంసంగ్ గెలాక్సీ S24, వివో T4x 5జీ, మోటో G86 పవర్ 5G, రెడ్‌మి నోట్ 14 SE 5G, రియల్‌మి P4 5జీ ఫోన్లపై కిర్రాక్ (Flipkart Black Friday Sale) డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ 5 స్మార్ట్‌ఫోన్లలో ఏది కావాలో ఇప్పుడే కొనేసుకోండి.
శాంసంగ్ గెలాక్సీ S24 :
ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో ఈ ఫ్లాగ్‌షిప్ శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ ధర మరోసారి తగ్గింది. డిస్కౌంట్ తర్వాత 8GB,128GB వెర్షన్ ధర రూ. 40,999కు పొందవచ్చు.
వివో T4x 5G :
ఈ డీల్ సమయంలో వివో T4x 5జీ ఫోన్ 6GB లేదా 128GB స్టోరేజ్‌తో ధర రూ. 14,499కు పొందవచ్చు. కానీ, ఐసీఐసీఐ, యాక్సస్ లేదా HDFC డెబిట్, క్రెడిట్ కార్డ్‌తో ఉపయోగిస్తే రూ. 500 తగ్గింపు పొందవచ్చు. వివో ఫోన్ తగ్గింపు ధరతో రూ. 13,999కు సొంతం చేసుకోవచ్చు.
Read Also : Oppo Reno 13 5G : ఆఫర్ అదిరింది భయ్యా.. ఒప్పో రెనో 13 5జీ చౌకైన ధరకే.. ఇంత తక్కువకు మళ్లీ దొరకదు..!
మోటో G86 పవర్ 5G :
ఈ సేల్ సమయంలో మోటోరోలా-బ్రాండెడ్ ఫోన్ (8GB, 128GB వెర్షన్) మోటో జీ86 పవర్ 5జీ ఫోన్ రూ. 17,999 తగ్గింపు ధరకు అందిస్తోంది. ఎస్బీఐ లేదా కోటాక్ బ్యాంక్ కార్డులతో చేసే పేమెంట్లపై రూ.1,000 తగ్గింపు పొందవచ్చు.
రెడ్‌మి నోట్ 14 SE 5G :
ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ రూ. 13,499 తగ్గింపు ధరకు అందిస్తోంది. ICICI, Axis, HDFC, SBI బ్యాంక్ కార్డులతో పేమెంట్లకు రూ. 1,000 తగ్గింపు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సస్, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ కార్డులతో పేమెంట్లకు రూ.1,625 తగ్గింపు పొందవచ్చు.
రియల్‌మి P4 5జీ :
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో 6GB లేదా 128GB స్టోరేజ్‌తో రియల్‌మి స్మార్ట్‌ఫోన్ రూ. 16,999 తగ్గింపు ధరకు అందిస్తోంది. అయితే, మీరు BHIM యాప్‌ని ఉపయోగించి యూపీఐ పేమెంట్ చేస్తే.. మీకు రూ.1050 తగ్గింపు లభిస్తుంది. మీరు ICICI, Axis, HDFC బ్యాంక్ కార్డులతో చెల్లిస్తే రూ.1170 తగ్గింపు పొందవచ్చు. ఈ రియల్‌మి ఫోన్ బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత రూ.15829కి కొనుగోలు చేయొచ్చు.
