Vrushakarma : నాగచైతన్య కొత్త సినిమా టైటిల్ ‘వృషకర్మ’.. దీని అర్ధం ఏంటో తెలుసా?
నేడు నాగచైతన్య కొత్త సినిమా టైటిల్ 'వృషకర్మ' అని ప్రకటించారు. (Vrushakarma)
Vrushakarma
Vrushakarma : ఇటీవల తండేల్ సినిమాతో హిట్ కొట్టిన నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. విరూపాక్ష తర్వాత కార్తీక్ దండు ఈ సినిమా చేస్తుండటంతో సినిమాపై మొదటి నుంచి అంచనాలు నెలకొన్నాయి.
నేడు నాగచైతన్య కొత్త సినిమా టైటిల్ ‘వృషకర్మ’ అని ప్రకటించారు. దీంతో ఇంత డిఫరెంట్ గా టైటిల్ ఉండటంతో అసలు వృషకర్మ అంటే ఏంటి అని అంతా వెతికేస్తున్నారు.
Also Read : Adah Sharma : ఇటీవలే వరుస హిట్స్.. అంతలోనే హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం..
వృషకర్మ అంటే.. ధర్మంగా తన పనిని తాను పూర్తి చేసేవాడు, కార్యసాధకుడు అని అర్ధం. అలాగే వృష లేదా వృషభం అంటే సంస్కృతంలో ఎద్దు. మరో అర్థంలో వృషకర్మ అంటే భక్తులకు వరాలు ప్రసాదించేవాడు, వర్షం కురిపించేవాడనే అర్థం కూడా వస్తుంది.
అయితే వృషకర్మ అనేది విష్ణుసహస్రనామావళిలో 112వది. విష్ణుమూర్తికి ఉన్న నామాల్లో వృషకర్మ ఒకటి. వృషకర్మలో వృష అంటే ధర్మం. వృషకర్మణే నమః అంటే ధర్మనిర్వహణే పనిగా కలిగిన స్వామికి నమస్కరిస్తున్నానని అర్థం. ఈ నామాన్ని మంత్రంగా జపిస్తే శుభకర్మలు జరుగుతాయని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. దీంతో వృషకర్మ సినిమాలో నాగచైతన్య ధర్మంగా పోరాడే పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తుంది.
View this post on Instagram
