Adah Sharma : ఇటీవలే వరుస హిట్స్.. అంతలోనే హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం..
తాజాగా హీరోయిన్ అదా శర్మ ఇంట్లో విషాదం నెలకొంది. (Adah Sharma)
Adah Sharma
Adah Sharma : బాలీవుడ్ భామ అదా శర్మ హార్ట్ అటాక్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో క్షణం, గరం, కల్కి.. పలు సినిమాలతో మెప్పించింది. హిందీలో వరుస సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది అదా శర్మ. ఇటీవల కేరళ స్టోరీ, బస్తర్.. సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది అదా శర్మ.(Adah Sharma)
తాజాగా హీరోయిన్ అదా శర్మ ఇంట్లో విషాదం నెలకొంది. అదా శర్మ నానమ్మ తులసి సుందర్ కొచ్చ నేడు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మరణించింది. దీంతో అదా శర్మ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అదా శర్మ రెగ్యులర్ గా తన గ్రాండ్ మదర్ తో కలిసి వీడియోలు కూడా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. తన నానమ్మను సరదాగా పతి అని పిలుస్తూ వీడియోలు చేస్తుంటుంది అదా.
Also Read : Spirit: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మొదలైన స్పిరిట్ మూవీ.. చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్
అదా శర్మ ఎక్కువగా తన నానమ్మ దగ్గర పెరగడంతో, ఆమెతో ఎక్కువ అనుబంధం ఉందని, ఆమె తనకు ప్రేరణ అని, తనకు సపోర్ట్ చేస్తుందని పలు ఇంటర్వ్యూలలో తెలిపింది. దీంతో అదా శర్మ నానమ్మ మరణంతో తీవ్ర విషాదంలో మునిగింది సమాచారం. ఈ క్రమంలో అదా శర్మ గతంలో నానమ్మ తో చేసిన వీడియోలు వైరల్ గా మారాయి.

