Spirit: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మొదలైన స్పిరిట్ మూవీ.. చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్న సినిమా స్పిరిట్(Spirit). చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలవలేదు.
Prabhas Spirit Movie Begins with Pooja Programs
Spirit; పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్న సినిమా స్పిరిట్(Spirit). చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలవలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా పూజ కార్యక్రమాలతో మొదలయ్యింది. నవంబర్ 23న జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ఆయన అన్న ప్రణయ్ రెడ్డి, హీరోయిన్ త్రిప్తి డిమ్రీ, భూషణ్ కుమార్ పాల్గొన్నాను.
దీనికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అప్డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు స్పిరిట్ సినిమా 2026 ఎండింగ్ లో లేదా 2027 సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
