Mahavatar Narsimha: ఆస్కార్ బరిలో “మహావతార్ నరసింహా”.. యానిమేషన్ కేటగిరీలో ఎంపిక.. లిస్టులో భారీ హాలీవుడ్ సినిమాలు
మహావతార్ నరసింహా(Mahavatar Narsimha).. మహావిష్ణువు అవతారమైన నరసింహుని కథాంశంలో వచ్చిన యానిమేటెడ్ మూవీ. దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
Mahavatar Narasimha movie nominated for 98th Oscar Awards
Mahavatar Narsimha: మహావతార్ నరసింహా.. మహావిష్ణువు అవతారమైన నరసింహుని కథాంశంలో వచ్చిన యానిమేటెడ్ మూవీ. దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నరసింహుని ఉగ్రరూపాన్ని తెరపై ఆవిష్కరించిన తీరుకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఒక్కో ఎలివేషన్, ఆ ఎలివేషన్ కి తగ్గట్టుగా వచ్చిన మ్యూజిక్ రోమాలునిక్కబొడుచుకునేలా చేశాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ మహావతార్ నరసింహా(Mahavatar Narsimha) సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. అంతేకాదు, కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబట్టింది ఈ సినిమా. కేవలం రూ.30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
Chaitanya Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ నా బ్రదర్ అని అందుకే చెప్పుకోను: చైతన్య జొన్నలగడ్డ
ఇక మహావతార్ నరసింహ తాజాగా మరో ఘనతను సాధించింది. 98వ ఆస్కార్ కు ఎంపిక అయ్యింది. యానిమేషన్ కేటగిరీలో ఈ సినిమా ఆస్కార్ లో ఎంట్రీ సాధించినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ యానిమేషన్ కేటగిరీలో పాప్ డీమన్ హంటర్స్, ఇన్ఫినిటీ కాస్టెల్, డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా వంటి హాలీవుడ్ సినిమాలు కూడా ఎంట్రీ దక్కించుకున్నాయి. మరి ఈ సినిమాలో ఏ సినిమాకు ఆస్కార్ వరిస్తుందో చూడాలి. అవార్డు వస్తుందా లేదా అనేది పక్కన పెడితే.. మహావతార్ నరసింహా సినిమా ఆస్కార్ కు ఎంపికవడం అనేది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే, ఇకముందు కూడా చాలా రకాల యానిమేటెడ్ సినిమాలు రావడానికి కూడా ఇది ప్రోత్సాహాన్ని కలిగించే విషయం అని చెప్పొచ్చు.
