Chaitanya Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ నా బ్రదర్ అని అందుకే చెప్పుకోను: చైతన్య జొన్నలగడ్డ
చైతన్య జొన్నలగడ్డ(Chaitanya Jonnalagadda).. ఈ నటుడి గురించి చాలా మందికి తెలియదు. యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా వచ్చిన బబుల్‌గమ్ సినిమాతో నటుడిగా మారాడు.
Actor Chaitanya Jonnalagadda made interesting comments about his brother Siddhu Jonnalagadda.
Chaitanya Jonnalagadda: చైతన్య జొన్నలగడ్డ.. ఈ నటుడి గురించి చాలా మందికి తెలియదు. యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా వచ్చిన బబుల్‌గమ్ సినిమాతో నటుడిగా మారాడు. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత హిట్ 3 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో కూడా నటించాడు చైతన్య జొన్నలగడ్డ. అయితే, ఈ నటుడి గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ నటుడు టాలీవుడ్ స్టార్ సిద్దు జొన్నలగడ్డ అన్నయ్య. అవును, ఈ సంగతి చాలా మందికి తెలియదు. అమెరికాలో ఐటీ జాబ్ చేసుకొనే చైతన్య జొన్నలగడ్డ(Chaitanya Jonnalagadda) నటనపై తనకున్న ఇష్టంతో సినిమాలోకి వచ్చాడు.
Vrushakarma: నాగ చైతన్య కొత్త సినిమా “వృషకర్మ”.. స్టన్నింగ్ లుక్ అదిరింది..
అయితే, తాజాగా ఈ నటుడు చేసిన లేటెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి. కొత్త దర్శకుడు సాయిలు తెరకెక్కించిన ఎమోషనల్ సినిమాకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో చైతన్య జొన్నలగడ్డ హీరోయిన్ తండ్రిగా వెంకన్న పాత్రలో కనిపించాడు. ఈ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచింది అంటూ నెటిజన్స్, సినిమా చూసిన ప్రేక్షకులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మోస్ట్ వైలెంట్ గా తెరకెక్కిన ఈ పాత్రకు ఖచ్చితంగా అవార్డ్స్ రావడం ఖాయం అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ నేపధ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతన్య జొన్నలగడ్డ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘ నేను బబుల్‌గమ్, హిట్ 3 సినిమాల్లో నటించాను. కానీ, ఎవరికీ తెలియదు. రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో వెంకన్న పాత్రకు మంచి స్పందన వస్తుంది. చాలా ఆనందంగా ఉంది. వెంకన్న పాత్ర కోసం చాలా రోజులు చీకట్లో కుంటడం ప్రాక్టీస్ చేశాను. హీరో సిద్ధు జొన్నలగడ్డ నా బ్రదర్. సినిమాల కోసం తన పేరును వాడుకోవాలని అనుకోవడం లేదు. అందుకే మా సినిమా ఏ ఈవెంట్ కి కూడా సిద్ధును పిలవలేదు. రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో నా నటన గురించి ప్రశంసిస్తూ సిద్ధు మెసేజ్ చేశాడు. ఈ సినిమా తరువాత ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నాను. అలాగే, రాజశేఖర్‌గారు హీరోగా చేస్తున్న ‘మగాడు’ సినిమాలో కూడా నటిస్తున్నాను”అంటూ చెప్పుకొచ్చాడు చైతన్య జొన్నలగడ్డ. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
