Nagarjuna : వామ్మో.. నాగార్జునకు లంచ్ లో రోజూ ఆ కర్రీ ఉండాల్సిందే.. ఎక్కువ మందికి అది ఇష్టం ఉండదు..
అసలు ఆయన ఏం తింటాడ్రా బాబు అని అందరూ చర్చించుకుంటారు. (Nagarjuna)
Nagarjuna
Nagarjuna : సెలబ్రిటీలు తమ ఫిట్నెస్, అందాన్ని కాపాడుకోవడానికి డైట్ చేస్తారు, ఫుడ్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని తెలిసిందే. ఇక నాగార్జున అయితే చెప్పక్కర్లేదు. 66 ఏళ్ళ వయసులో కూడా ఇంకా ఫిట్ గా, అందంగా కనిపిస్తూ నవ మన్మధుడిలా ఉంటారు. అసలు ఆయన ఏం తింటాడ్రా బాబు అని అందరూ చర్చించుకుంటారు. అయితే తాజాగా నాగార్జునతో పనిచేసిన ఓ వ్యక్తి ఆయన ఎక్కువగా ఏం తింటాడో తెలిపాడు.(Nagarjuna)
నాగార్జున వారంలో సోమవారం నుంచి శనివారం వరకు వెజ్ తింటారట. ఆదివారం మాత్రమే నాన్ వెజ్ ఎక్కువగా తింటారట. ఆదివారం డైట్ పక్కన పెట్టేసి ఫుల్ గా అన్ని తింటారట. అయితే నాగార్జునకు ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్ లో బెండకాయ కూర ఉండాల్సిందేనట. సాధారణంగా బెండకాయను తినడానికి చాలా మంది ఇష్టపడరు. బెండకాయ ఫ్రై అయితేనే తింటారు కానీ బెండకాయ కర్రీ, పులుసు ఎక్కువ మండి తినడానికి ఆసక్తి చూపించరని తెలిసిందే.
కానీ బెండకాలో విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కె, విటమిన్ బి12, పొటాషియం, ఫైబర్, క్యాల్షియం, మాంగనీస్, కాపర్, సెలీనియం.. లాంటివి సమృద్దిగా ఉంటాయట. ఇలాంటి విటమిన్స్ కావాలంటే పండ్లు అన్ని తినాలి. కానీ బెండకాయ ఒక్కటి తింటే సరిపోతుందట. అందుకే నాగార్జున మధ్యాహ్నం లంచ్ లో ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా కచ్చితంగా బెండకాయ కూర ఉండేలా చూసుకుంటారు అట. రైస్ తక్కువ తిని కర్రీ ఎక్కువ తింటారట. దీంతో ఇది కూడా నాగార్జున డైట్ సీక్రెట్ లో ఒకటి అని తెలుస్తుంది.
