Karmanye Vadhikaraste : ఓటీటీలోకి వచ్చేసిన ‘కర్మణ్యే వాధికారస్తే’.. సీరియస్ ఇష్యూ మీద తీసిన సినిమా..

కర్మణ్యే వాధికారస్తే సినిమా ఇటీవల అక్టోబర్ 31న థియేటర్స్ లో రిలీజయింది. (Karmanye Vadhikaraste)

Karmanye Vadhikaraste : ఓటీటీలోకి వచ్చేసిన ‘కర్మణ్యే వాధికారస్తే’.. సీరియస్ ఇష్యూ మీద తీసిన సినిమా..

Karmanye Vadhikaraste

Updated On : November 23, 2025 / 5:26 PM IST

Karmanye Vadhikaraste : బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్రన్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘కర్మణ్యే వాధికారస్తే’. ఉషస్విని ఫిలిమ్స్ బ్యానర్ పై జవ్వాజి సురేంద్ర కుమార్ సమర్పణలో DSS దుర్గా ప్రసాద్ నిర్మాణంలో అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.

కర్మణ్యే వాధికారస్తే సినిమా ఇటీవల అక్టోబర్ 31న థియేటర్స్ లో రిలీజయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలో నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

Also Read : Jabardasth Naresh : నా హైట్ వల్ల మా అమ్మ చాలా బాధపడింది.. నన్ను ఏడిపించేవాళ్ళు.. నరేష్ ఎమోషనల్..

ఈ సందర్భంగా దర్శకుడు అమర్ దీప్ చల్లపల్లి మాట్లాడుతూ.. మా కర్మణ్యే వాధికారస్తే సినిమా థియేటర్స్ లో విడుదల అయి మంచి విజయం సాధించింది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు బాగుంది అన్నారు. ఇప్పుడు మా సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలోకి వచ్చేసింది అని తెలిపాడు. నిర్మాత డిఎస్ఎస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. మా సినిమాకు మంచి స్పందన వచ్చింది. 100 థియేటర్స్ లో విడుదల చేసాము. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. అందరూ తప్పక చూడండి అని అన్నారు.

 

View this post on Instagram

 

A post shared by SUN NXT (@sunnxt)

 

Also Read : Tollywood Hero : నాకు పేరు పెట్టింది ఆయనే.. సత్యసాయితో చిన్నప్పటి ఫోటో షేర్ చేసిన స్టార్ హీరో.. ఎవరో కనిపెట్టండి..

కర్మణ్యే వాధికారస్తే కథేంటంటే.. ఈ సినిమా మూడు కథలతో సమాంతరంగా సాగుతుంది. కిరీటి(బ్రహ్మాజీ) ఓ సిన్సియర్ పోలీసాఫీసర్. ఓ రోజు రేప్ కి గురయిన ఒక అమ్మాయి స్పృహ తప్పి పడిపోయి ఉండటం చూస్తాడు కిరీటి. ఆ అమ్మాయిని హాస్పిటల్ లో చేర్చి ట్రీట్మెంట్ ఇప్పించి ఆమెకు తెలివి వచ్చేవరకు బయటకు తెలియకూడదు అని తన ఇంట్లోనే ఉంచుతాడు. ఆమె బ్యాగ్ లో గన్స్ కి సంబంధించిన ఫోటోలు, కొన్ని కోడ్స్ కనిపిస్తాయి. దీంతో ఆమె ఎవరు అని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెడతాడు. మరోవైపు పృథ్వీ(పృథ్వీ) యాక్సిడెంట్ చేయడంతో ఒక వ్యక్తి మరణిస్తాడు. ఆ కేసు పోలీసాఫీసర్ అర్జున్(శత్రు) దగ్గరికి వస్తుంది. కానీ ఆ వ్యక్తి ముందే చనిపోయాడు, యాక్సిడెంట్ వల్ల కాదు అని పోస్ట్ మార్టంలో తెలుస్తుంది. ఆ బాడీ కోసం కూడా ఎవరూ రారు. అలాంటి కేసులు వైజాగ్ లో చాలా ఉన్నాయని తెలిసి అర్జున్ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడతాడు. మరోవైపు జై(మాస్టర్ మహింద్రన్) అమ్మాయిలను ట్రాప్ చేసి మత్తుమందు ఇచ్చి కిడ్నాప్ చేస్తూ ఉంటాడు. అసలు జై ఎవరు? రేప్ కి గురయిన అమ్మాయి ఎవరు? కిరీటి, అర్జున్ లు వాళ్ళ కేసులని సాల్వ్ చేస్తారా? ఈ ముగ్గురు చేసే పనులకు, వాళ్ళ కేసులకు లింక్ ఏంటి తెలియాలంటే సినిమా ఓటీటీలో చూసేయండి..