Siddu Jonnalagadda: ఓటీటీలో అడుగుపెడుతున్న సిద్దు.. సూపర్ హిట్ డైరెక్టర్ తో క్రేజీ ప్రాజెక్ట్
నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda).
Siddu Jonnalagadda is doing a huge web series on Netflix
Siddu Jonnalagadda: డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ గా మారిపోయాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ. ఆ సినిమా తరువాత స్టార్ బాయ్ గా మారిపోయిన సిద్దు టిల్లు స్క్వైర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఆ తరువాత చేసిన రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన జాక్, నీరజ కోన తో చేసిన తెలుసు కదా రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి.
దీంతో, సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) కెరీర్ మళ్ళీ క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆచి తూచి నిర్మయాలు తీసుకుంటున్నాడు సిద్దు. ఈమధ్య సితార ఎంటర్టైన్మెంట్స్ బైనార్ లో కోహినూర్ అనే సినిమా సస్టార్ట్ చేశాడు. కానీ, అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇక రీసెంట్ గా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ దర్శకుడు స్వరూప్ తో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు సిద్దు.
Suhas: కార్తీక్ సుబ్బరాజ్ తో సుహాస్ మూవీ.. స్వయంగా ప్రకటించిన హీరో
ఈ సినిమాను కూడా సితార బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈనేపథ్యంలోనే తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టును ఒకే చేశాడట సిద్దు జొన్నలగడ్డ. సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఈ దర్శకుడు ప్రస్తుతం తమిళ స్టార్ సూర్యతో ఓ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత వెంకీ అట్లూరి సిద్దు జొన్నలగడ్డతో ఓ ప్రాజెక్టు చేస్తున్నాడట.
అయితే సినిమా కాకుండా వెబ్ సిరీస్ చేస్తున్నాడట. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ ఇద్దరి కాంబోలో ఒక భారీ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తుందట. ఇన్వెస్టిగేట్వ్ థ్రిల్లర్ జానర్ లో రానున్న ఈ సిరీస్ కోసం భారీగానే ఖర్చు చేయనుందట నెట్ ఫ్లిక్స్. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఈ ఇద్దరు తమ తమ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్న తరువాత ఏ వెబ్ సిరీస్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. 2027లో ఈ ప్రాజెక్టు ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. మరి సినిమాలతో వరుస ప్లాప్స్ అందుకున్న సిద్దు ఈ సిరీస్ తో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడు అనేది చూడాలి.
