Smriti Mandhana: కొద్దిగంటల్లో పెళ్లి.. సడన్ గా ఆగిన స్మృతి మంథాన వివాహం.. కారణం ఇదే..
Smriti Mandhana: ప్రముఖ భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోయింది. కాసేపట్లో వివాహం జరగాల్సి ఉండగా సడెన్ గా ఆగిపోయింది. దీనికి కారణం స్మృతి మంధాన తండ్రికి హార్ట్ అటాక్ రావడమే.
ఆదివారం స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ వివాహం జరగాల్సి ఉంది. ఇంతలో మంధాన స్వస్థలం సాంగ్లిలో అత్యవసర సేవలు అవసరమయ్యాయి. మంధాన తండ్రిని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. దీంతో వారి వివాహం నిరవధికంగా వాయిదా పడింది.
స్మృతి తండ్రి ఆరోగ్యం మరింత దిగజారడంతో సాంగ్లిలోని సర్విత్ ఆసుపత్రిలో చేర్చారు. పెళ్లి వేడుకల సమయంలో అత్యవసర వాహనం ఊహించని విధంగా అక్కడికి రావడంతో అక్కడున్న అతిథులు, శ్రేయోభిలాషులు భయాందోళనకు గురయ్యారు.
ఆదివారం పెళ్లి రోజు అల్పాహారం సమయంలో శ్రీనివాస్ మంధాన ఆరోగ్యం క్షీణించింది. ఆయన బాగుంటారని అనుకున్నప్పటికీ.. ఆయన పరిస్థితి మరింత దిగజారింది. దీంతో అంబులెన్స్ వచ్చింది. స్మృతి తండ్రి ఆరోగ్యం బాగోలేదని, స్మృతి వివాహం నిరవధికంగా వాయిదా పడిందని స్మృతి మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా ధృవీకరించారు. స్మృతి తండ్రి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది.
మంధాన తండ్రి శ్రీనివాస్.. ఆమె క్రికెట్ ప్రయాణంలో కీ రోల్ ప్లే చేశారు. ఆయన సాంగ్లికి జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడారు. అంతకుమించి రాణించాలని అనుకున్నా.. ఆ కల సాకారం కాలేదు. ఆయనకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించలేదు. దీంతో ఒక తండ్రిగా తన కూతురు స్మృతి కెరీర్‌లో విజయం సాధించడానికి అవసరమైనవన్నీ పొందేలా చూశారు. స్మృతి తన తండ్రి నమ్మకాన్ని నిలిపింది. అద్భుతమైన క్రికెటర్ గా రాణించింది. భారత జట్టు మహిళల ప్రపంచ కప్ గెలవడంలో స్మృతి కీ రోల్ ప్లే చేసింది.
Also Read: వాళ్లిద్దరూ ఔట్..! టీమిండియా వన్డే కెప్టెన్సీ పగ్గాలు మళ్లీ రోహిత్ శర్మకే.. ఇక దబిడిదిబిడే
