Rashmika Mandanna:కన్నీళ్లు పెట్టుకున్న రష్మిక.. విజ్జూ అంటూ ప్రేమగా.. విజయ్ తో పెళ్లిపై ఎమోషనల్ కామెంట్స్
విజయ్ తో పెళ్లి సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్న రష్మిక(Rashmika Mandanna).
Rashmika sheds tears on the occasion of her wedding with Vijay
Rashmika Mandanna: విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా ఒకటయ్యారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు భార్యాభర్తలు అయ్యారు. వీరి పెళ్లి కుటుంబసభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబందించిన ఫోటోలను అటు విజయ్, ఇటు రష్మిక ఇద్దరు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Virosh Wedding: పెళ్లి బంధంతో ఒకటైన విజయ్- రష్మిక.. ఫోటోలు షేర్ చేసిన కొత్త జంట
అయితే, ఆ ఫోటోలలో ఒక ఫోటో మాత్రం నెటిజన్స్ చూపులను ఆకర్షించింది. ఆ ఫోటో ఏంటంటే, రష్మిక(Rashmika Mandanna) కన్నీళ్లు పెట్టుకున్న ఫోటో. అవును, తాను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు తనవాడు అవుతున్నాడన్న సంతోషంతో రష్మిక కన్నీళ్లు పెట్టుకుంది. విజయ్ తన మేడలో తాళికడుతున్న వేల భావోద్వేగాన్ని ఆపుకోలేని రష్మిక కంటనీరు పెట్టుకుంది.ఆ ఫోటో చూసిన ప్రతీ ఒక్కరూ రష్మిక విజయ్ ని అంతలా ప్రేమించిందా అంటూ చేస్తున్నారు. ఆ కన్నీళ్లు చూస్తేనే అర్థం అవుతోంది ఆమె ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంది అని అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మరోపక్క ఇన్స్టాగ్రామ్లో కూడా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రష్మిక. ఇప్పుడు నేను మీకు నా భర్తను పరిచయం చేస్తాను. అంతనే విజయ్ దేవదకొండ. నీ లాంటి భర్త నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. నా ప్రతీ ఎమోషన్ లో నువ్వు నాతో ఉన్నావు. నీ భార్యగా ఉండేందుకు నేను చాలా ఆతృతగా ఉన్నాను’అంటూ రాసుకొచ్చింది. దీంతో, రష్మిక చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
View this post on Instagram
