Smriti Mandhana: ప్రముఖ భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోయింది. కొన్ని గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా సడెన్ గా ఆగిపోయింది. దీనికి కారణం స్మృతి మంధాన తండ్రికి హార్ట్ అటాక్ రావడమే.
ప్రియుడు, మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ తో ఆదివారం మహారాష్ట్ర సాంగ్లీలో స్మృతి మంధాన వివాహం జరగాల్సి ఉంది. ఇంతలో స్మృతి ఇంట్లో అత్యవసర సేవలు అవసరమయ్యాయి. మంధాన తండ్రి శ్రీనివాస్ కు ఈ ఉదయం హార్ట్ అటాక్ వచ్చింది. ఆయనను ఆసుపత్రికి తరలించారు. దీంతో స్మృతి వివాహం నిరవధికంగా వాయిదా పడింది.
స్మృతి తండ్రి ఆరోగ్యం మరింత దిగజారడంతో సాంగ్లిలోని సర్వ్ హిత్ ఆసుపత్రికి తరలించారు. పెళ్లి వేడుకల సమయంలో ఊహించని విధంగా వేదిక వద్దకు అంబులెన్స్ రావడంతో అక్కడున్న అతిథులు, శ్రేయోభిలాషులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక కంగారు పడ్డారు. ఈ ఉదయం అల్పాహారం సమయంలో శ్రీనివాస్ మంధాన అస్వస్థతకు గురయ్యారు. తన తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో స్మృతి తన వివాహాన్ని వాయిదా వేసుకుందని స్మృతి మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా ధృవీకరించారు. తండ్రి ఆరోగ్యం కుదుటపడ్డాకే స్మృతి పెళ్లి చేసుకుంటారని ఆయన వెల్లడించారు. కాగా, ప్రస్తుతం శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.
”స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన సాంగ్లిలోని తమ ఫామ్‌హౌస్‌లో బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్న సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన డాక్టర్ల పరిశీలనలో ఉన్నారు. తన తండ్రికి బాగోలేకపోవడంతో వివాహ వేడుకను వాయిదా వేసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని స్మృతి తీసుకుంది. శ్రీనివాస్ పూర్తిగా కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉండాలని డాక్టర్లు సూచించారు” అని స్మృతి మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా తెలిపారు. కాగా, ఈ క్లిష్ట సమయంలో తమను ఎవరూ ఇబ్బంది పెట్టొద్దని, దేని గురించి అడగొద్దని , తమకు సహకరించాలని రెండు కుటుంబాలు విజ్ఞప్తి చేశాయి.
మంధాన తండ్రి శ్రీనివాస్.. ఆమె క్రికెట్ ప్రయాణంలో కీ రోల్ ప్లే చేశారు. ఆయన సాంగ్లికి జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడారు. అంతకుమించి రాణించాలని అనుకున్నా.. ఆ కల సాకారం కాలేదు. ఆయనకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించలేదు. దీంతో ఒక తండ్రిగా తన కూతురు స్మృతి కెరీర్‌లో విజయం సాధించడానికి అవసరమైనవన్నీ పొందేలా చూశారు. స్మృతి తన తండ్రి నమ్మకాన్ని నిలిపింది. అద్భుతమైన క్రికెటర్ గా రాణించింది. భారత జట్టు మహిళల ప్రపంచ కప్ గెలవడంలో స్మృతి కీ రోల్ ప్లే చేసింది.
Also Read: వాళ్లిద్దరూ ఔట్..! టీమిండియా వన్డే కెప్టెన్సీ పగ్గాలు మళ్లీ రోహిత్ శర్మకే.. ఇక దబిడిదిబిడే