Vijayasai Reddy: జగన్ కు నా సూచన ఏంటంటే.. విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్
నాపై చాలా ఒత్తిళ్లు వచ్చాయి. ప్రస్తుతానికి రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన, చేరే ఆలోచన లేదు.
Vijayasai Reddy: రెడ్డి సంక్షేమ సంఘం భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ చీఫ్ జగన్ కు ఓ సూచన చేశారాయన. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయనను డైవర్ట్ చేస్తోందన్న విజయసాయిరెడ్డి.. నిబద్దత లేని వారి మాటలు వినొద్దని జగన్ కు సూచించారు.
పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, రాజశేఖర్ రెడ్డి పేరుతో జిల్లాలు ఉన్నాయని.. సైరా నరసింహరెడ్డి పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని ఆయన సూచించారు. అలా చేస్తే ఒక స్వాతంత్ర్య సమరయోధుడిని గౌరవించినట్టు అవుతుందన్నారు. శ్రీకాకుళంలో రెడ్డి సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి మొత్తం నేనే భరిస్తాను అని చెప్పారు. చాలామంది నాపై చాలా సెటైర్లు వేస్తున్నారన్న విజయసాయిరెడ్డి.. ఎవరెన్ని అనుకున్నా నేను ప్రస్తుతం రైతును మాత్రమే అని తేల్చి చెప్పారు.
”నాపై చాలా ఒత్తిళ్లు వచ్చాయి. ప్రస్తుతానికి రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన, చేరే ఆలోచన లేదు. విపరీతమైన ఒత్తిడి వచ్చినా నేను ఎవరికీ లొంగలేదు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ని డైవర్ట్ చేస్తుంది. నిబద్దత లేని వారి మాటలు వినొద్దని జగన్ కు నా సూచన. నాకు ఏ పార్టీ నుంచి కూడా పిలుపు రాలేదు. పవన్ కల్యాణ్ తో 20ఏళ్ళ స్నేహం ఉంది” అని హాట్ కామెంట్స్ చేశారు విజయసాయిరెడ్డి.
Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. ఆ ఔషధాల ధరలు పెరుగుతున్నాయ్.. రెండు లక్షల ఉద్యోగాలు ఔట్..?
