Black Friday Sale 2025 : బ్లాక్ ఫ్రైడే సేల్ ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 10 ప్రోపై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఆర్డర్ పెట్టడమే ఆలస్యం..!

Black Friday Sale 2025 : విజయ్ సేల్స్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో గూగుల్ పిక్సెల్ 10పై రూ. 10వేలు బ్యాంకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

1/5Google Pixel 10 Pro
Black Friday Sale 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? విజయ్ సేల్స్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 సందర్భంగా గూగుల్ సరికొత్త పిక్సెల్ ఫోన్ తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ సమయంలో గూగుల్ పిక్సెల్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌ డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయొచ్చు. పిక్సెల్ అభిమానులు తప్పక కొనాల్సిన ఫోన్ ఇది. ఈ పిక్సెల్ 10 ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లతో పాటు ఆఫర్‌లు, ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
2/5Google Pixel 10 Pro
గూగుల్ పిక్సెల్ 10 ప్రో ధర, ఆఫర్లు : గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోన్ 16GB,256GB స్టోరేజ్ వేరియంట్‌ విజయ్ సేల్స్‌లో ధర రూ.109,999కు పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్ విషయానికొస్తే.. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ఫ్లాట్ రూ.10వేలు తగ్గింపు పొందవచ్చు. ఆ తర్వాత ధర రూ. 99,999కు పొందవచ్చు.
3/5Google Pixel 10 Pro
గూగుల్ పిక్సెల్ 10 ప్రో కీలక ఫీచర్లు : గూగుల్ పిక్సెల్ 10 ప్రో స్పెసిఫికేషన్లలో 1280×2856 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.3-అంగుళాల సూపర్ యాక్టువా ఎల్టీపీఓ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 కవర్ గ్లాస్ కూడా ఉంది. గూగుల్ టెన్సర్ G5 ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
4/5Google Pixel 10 Pro
కెమెరా, బ్యాటరీ : కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 48MP టెలిఫోటో కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 42MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G, GPS, Wi-Fi, NFC, USB టైప్-C, గూగుల్ క్యాస్ట్, బ్లూటూత్ ఉన్నాయి.
5/5Google Pixel 10 Pro
30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4870mAh బ్యాటరీ ద్వారా పవర్ పొందవచ్చు. ఫేస్ అన్‌లాక్ ఫింగర్ ప్రింట్ అన్‌లాక్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.